హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

నేడు తిరుమలకు ప్రధాని మోదీ... మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా అంశం...

నేడు తిరుమలకు ప్రధాని మోదీ... మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా అంశం...

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

PM Narendra Modi : కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో తిరుపతి సభలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఇప్పుడు అదే తిరుపతికి ఆయన మరోసారి వస్తుండటంతో... ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది.

  శనివారం మాల్దీవుల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ... ఇవాళ ఉదయం శ్రీలంక పర్యటనకు వెళ్తున్నారు. ఈ టూర్‌లో ఆయన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో చర్చలు జరుపుతారు. శ్రీలంకలో ఈస్టర్ సండే పేలుళ్లు జరిగి 11 మంది భారతీయులు సహా 250కి పైగా మంది మృతి చెందిన తరువాత ఆ దేశంలో పర్యటిస్తున్న తొలి విదేశీ నేత మోదీయే. మోదీ శ్రీలంకలో పర్యటించడం ఇది మూడోసారి. ఇదివరకు ఆయన 2015, 2017లో వెళ్లారు. మోదీ ఉదయం 11 గంటలకు శ్రీలంక రాజధాని కొలంబో చేరుకుంటారు. అధ్యక్షుడు సిరిసేన ఇస్తున్న మధ్యాహ్న విందుకు హాజరవుతారు. తర్వాత సిరిసేనతో చర్చలు జరుపుతారు. కొలంబోలో చర్చల తర్వాత మోదీ తిరుమలకు రాబోతున్నారు.


  మోదీ పర్యటనకు సీఎం జగన్ షెడ్యూల్ ఇదీ :

  2.30 ఇంటి నుంచీ బయలుదేరే సీఎం జగన్

  2.50 గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి సీఎం జగన్

  3.00 రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరనున్న జగన్

  3.45 రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కి రానున్న జగన్

  4.30 ప్రధాని మోదీకి సీఎం జగన్ ఆహ్వానం

  4.40 తిరుమలకు సీఎం జగన్ పయనం

  7.10 రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కి జగన్ పయనం

  8.00 రేణిగుంట ఎయిర్‌పోర్ట్ చేరనున్న జగన్

  8.15 ప్రధానిని సాగనంపనున్న సీఎం జగన్

  8.30 గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరనున్న జగన్

  9.15 గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరనున్న సీఎం జగన్

  9.25 ఇంటికి బయలుదేరనున్న జగన్

  9.45 ఇంటికి చేరనున్న సీఎం జగన్


  నేటి సాయంత్రం 4.30కు రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ అవుతారు ప్రధాని మోదీ. ప్రోటోకాల్ ప్రకారం సీఎం జగన్, గవర్నర్ నరసింహన్ ఆయనకు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత విమానాశ్రయానికి దగ్గర్లోనే బీజేపీ ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. ఈ సభకు విజయోత్సవ సభగా పేరు పెట్టారు. సభలో పాల్గొన్న తర్వాత మోదీ... రోడ్డు మార్గాన తిరుమల చేరుకుంటారు.


  గెస్ట్ హౌస్‌లో 20 నిమిషాల విశ్రాంతి తర్వాత ప్రధాని మోదీ... వెంకన్న స్వామి దర్శనానికి బయల్దేరతారు. సాయంత్రం 6 గంటలకు వరాహ స్వామిని దర్శిస్తారు. తర్వాత శ్రీవారి ఆలయంలో పూజలు చేస్తారు. రాత్రి 7.20కి మోదీ రోడ్డు మార్గాన తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచీ ప్రత్యేక విమానంలో రాత్రి 8.30కి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.


  2014 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని కాక ముందు మోదీ... తిరుమల శ్రీవారిని దర్శించారు. ప్రధాని అయ్యాక... 2015 అక్టోబర్, 2017 జనవరిలో వచ్చారు. మళ్లీ ఇప్పుడు రెండోసారి ప్రధాని అయ్యాక వస్తున్నారు.


  ప్రత్యేక హోదా సంగతేంటి? : ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే... వైఎస్ జగన్... ఢిల్లీ వెళ్లి మోదీని కలిశారు. ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. ఐతే... కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోయి ఉంటే బాగుండేదని జగన్ అప్పట్లో అన్నారు. ప్రత్యేక హోదాపై అవకాశం వచ్చినప్పుడల్లా అడుగుతానని అన్నారు. తాజాగా తిరుపతికి రాగానే... గెస్ట్ హౌస్‌లో ఈ అంశాన్ని సీఎం జగన్ లేవనెత్తుతారని తెలుస్తోంది. మోదీ నుంచీ తాజాగా ఎలాంటి హామీ రాకపోయినా, ప్రత్యేక హోదా అంశాన్ని లేనెత్తడం ద్వారా... ఈ విషయాన్ని ఏపీ ప్రజలు ఇంకా మర్చిపోలేదనే సంకేతాలు జగన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

  First published:

  Tags: Maldives, Narendra modi, Sri Lanka Blasts, Tirumala news

  ఉత్తమ కథలు