Home /News /andhra-pradesh /

PM NARENDRA MODI TO PARTICIPATE ALLURI SITARAMARAJU BIRTH ANNIVERSARY EVENT IN BHIMAVARAM ON 4TH JULY SK

PM Narendra Modi: మన్యం వీరుడి జయంతికి మోదీ రాక -ఏపీలో బీజేపీ అనూహ్య వ్యూహం.. వివరాలివే.

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

Narendra Modi AP Tour: ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే ఏపీలో పర్యటించనున్నారు. మరి ప్రధాని మోదీ ఎప్పుడు వస్తారు? ఏయే కార్యక్రమాల్లో పాల్గొంటారు? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

    విభజన హామీలు, ప్రత్యేక హోదా విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ సరికొత్త వ్యూహంతో ఏపీలో పాగాకు సిద్ధమవుతోంది. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను అందుకు అవకాశంగా భావిస్తోంది. ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత ఏపీకి వస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi AP tour). ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన ఆయన.. త్వరలోనే ఏపీలో కూడా పర్యటించబోతున్నారు. ఏపీలో నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju)  కీలక వ్యాఖ్యలు చేశారు. జులై 4న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి ప్రధాని  మోదీ వస్తారని వెల్లడించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు 125వ జయంతి (Alluri Sitaramaraju 125th Birth Anninersary) వేడుకల్లో ఆయన పాల్గొంటారని తెలిపారు. ఇది అధికారిక కార్యక్రమం. ప్రధాని హోదాలో ఆయన పాల్గొననున్నారు. ఐనప్పటికీ రాష్ట్ర బీజేపీ నేతల కోసం కొంత సమయం కేటాయించి.. వారిని కలుస్తారని తెలుస్తోంది. ఇటీవల తెలంగాణలో కూడా అదే జరిగింది. ISB వార్షికోత్స వేడుకల్ల పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని.. బేగంపేట ఎయిర్‌పోర్టులోనే బీజేపీ నేతలను కలిశారు. అనంతరం స్వాగత సభలో పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసగించారు. భీమవరం పర్యటన కూడా ఇంచుమించు ఇలానే ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    Tirumala Update: తిరుమలలో ఊహించని రద్దీ.. భక్తులు రావొద్దు.. టీటీడీ కీలక ప్రకటన..

    ప్రధాని మోదీ పర్యటన కంటే ముందే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda AP tour) ఏపీలో పర్యటిస్తారని సోమువీర్రాజు పేర్కొన్నారు. జూన్ 7, 8 తేదీల్లో జేపీ నడ్డా ఏపీలో పర్యటిస్తారు. జూన్ 7న రాజమహేంద్రవరంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. బహిరంగ సభ మరుసటి రోజు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)తో జేపీ నడ్డా సమావేశమవుతారని తెలుస్తోంది. ఆ సమావేశంలో ప్రధానంగా పొత్తుల గురించే చర్చిస్తారని సమాచారం. ఇరువురి భేటీ తర్వాత బీజేపీ, జనసేన పొత్తులపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. జూన్ 8న విజయవాడలో పార్టీ నేతలతో జేపీ నడ్డా భేటీ అవుతారు. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా వారికి దిశానిర్దేశం చేయనున్నారు.

    Mahanadu: ముందస్తు ఎన్నికలకు సిద్ధం.. మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

    2019 ఎన్నికల సమయంలో పలుమార్లు ఏపీలో పర్యటించిన ప్రధాని మోదీ. 2019లో ఫిబ్రవరి 10న గుంటూరు సభలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత ఏప్రిల్‌లో రాజమండ్రి సభకూ వచ్చారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. కేవలం రెండు సార్లు మాత్రమే ఏపీకి వచ్చారు ప్రధాని మోదీ. ఒకసారి తిరుమల శ్రీవారి దర్శనానికి రాగా.. మరోసారి షార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి వచ్చి.. కేవలం ఆయా కార్యక్రమాల్లో పాల్గొని.. తిగిరి వెళ్లిపోయారు. అంతేతప్ప ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ ఈసారి మాత్రం రాజకీయంగానూ నేతలతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలతో బీజేపీలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తుందని.. పార్టీ బలోపేతానికి ఇది దోహదపడుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, PM Narendra Modi

    తదుపరి వార్తలు