హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

29న ఏపీకి ప్రధాని మోదీ... ఏం చెప్తారు... ప్రత్యేక హోదాపై మాట్లాడతారా?

29న ఏపీకి ప్రధాని మోదీ... ఏం చెప్తారు... ప్రత్యేక హోదాపై మాట్లాడతారా?

నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ

AP Assembly Elections 2019 : బయటకు కనిపించకపోయినా... ఇప్పటికీ ప్రత్యేక హోదా అంశం ఏపీ ప్రజల మనసుల్లో అలాగే ఉంది. కాంగ్రెస్, బీజేపీలను చూడగానే ప్రజలకు అది గుర్తొస్తుంది.

ఎన్నికలు రాగానే... జాతీయ పార్టీలకు... రాష్ట్రాలు గుర్తొస్తాయన్నట్లు తయారవుతోంది పరిస్థితి. ఏపీలో త్రిముఖ పోరే తప్ప... బీజేపీ, కాంగ్రెస్‌కి ప్రస్తుతం ఛాన్స్ లేదన్నది వాస్తవం. అయినప్పటికీ ఓట్ల శాతం పెంచుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఈ నెల 29న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. ఆ రోజు కర్నూలులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఏప్రిల్ 1న రాజమండ్రిలో జరిగే మరో సభలో కూడా ప్రసంగిస్తారు. షెడ్యూల్ ఫిక్స్ చేసిన రాష్ట్ర బీజేపీ... మళ్లీ మోదీ నినాదం అందుకుంది. అందుకు సంబంధించిన పాంప్లెట్లు పంచుతోంది. బీజేపీకి ఓటు వేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందనీ, అవినీతి లేని పాలన అందిస్తున్నామనీ చెబుతోంది.

బయటకు కనిపించకపోయినా... ఇప్పటికీ ప్రత్యేక హోదా అంశం ఏపీ ప్రజల మనసుల్లో అలాగే ఉంది. కాంగ్రెస్, బీజేపీలను చూడగానే ప్రజలకు అది గుర్తొస్తుంది. మరి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ పెద్దలు ఏం మొహం పెట్టుకొని ఏపీకి వస్తారన్నది ప్రత్యర్థి పార్టీలు వేస్తున్న ప్రశ్న. తాము హోదా కావాలా, ప్యాకేజీ కావాలా అని అడిగితే... ఏపీ ప్రభుత్వం ప్యాకేజీ కావాలని అడిగిందనీ, తీరా మధ్యలో మాట మార్చి, యూ టర్న్ తీసుకుందని వాదిస్తోంది బీజేపీ. ఇలా రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలు, వేసే రాంగ్ స్టెప్పులకు ఏపీ ప్రజలెందుకు మోసపోవాలి? ప్రత్యేక హోదా ఇచ్చే హామీతోనే రాష్ట్రాన్ని విభజించారు కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది. అది జరగనంతకాలం... బీజేపీపై ఏపీలో వ్యతిరేకత ఉండటం సహజమే.

ఏపీ ప్రజలు తమను తిరస్కరిస్తారని బీజేపీకి కూడా తెలుసు. అందుకే తెలుగు రాష్ట్రాలపై కమలదళం పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. తెలంగాణలో ఎలాగూ టీఆర్ఎస్‌కే ఎక్కువ లోక్ సభ స్థానాలు వస్తాయి కాబట్టి... అక్కడ ఆ పార్టీ మద్దతు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇక ఏపీలో ఈసారి వైసీపీ గెలుస్తుందనే అంచనాల్లో ఉన్న కమలం అండ్ కో... ఎన్నికల తర్వాత వైసీపీ మద్దతు పొంది NDA పరిధిని పెంచుకోవాలనే ఆలోచనలో ఉంది. అయినప్పటికీ... ఏపీలో బీజేపీ శ్రేణులను నిరుత్సాహ పరచకుండా ఉండేందుకు ప్రధాని మోదీ వస్తున్నట్లు తెలిసింది.


ఇవి కూడా చదవండి :

నామినేషన్లకు నేడే ఆఖరి రోజు... ఇప్పటివరకూ ఎన్ని వేశారు... ప్రత్యేకతలేంటి?

కన్నా, రాయపాటి, శ్రీకృష్ణ... గుంటూరు... నరసారావుపేట ఎంపీ స్థానంలో గెలిచేదెవరు?

PUBG : ఇండియాలో పబ్‌జీ ఎర్రర్ ఫిక్సైంది... ఇక ఎంతసేపైనా ఆడుకోవచ్చు...

Published by:Krishna Kumar N
First published:

Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019, Narendra modi

ఉత్తమ కథలు