ఏపీ మూడు రాజధానులపై ప్రధాన మంత్రి కార్యాలయం ఆరా..?

గవర్నర్‌కు ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి జి.వి.ఆర్ శాస్త్రి పీఎంవోకు లేఖ రాశారు. దానిపై స్పందించిన ప్రధాన మంత్రి కార్యాలయం.. గవర్నర్‌ కార్యాలయాన్ని వివరాలు అడిగినట్లు సమాచారం.

news18-telugu
Updated: July 23, 2020, 1:48 PM IST
ఏపీ మూడు రాజధానులపై ప్రధాన మంత్రి కార్యాలయం ఆరా..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో మూడు రాజధానుల అంశం మళ్లీ వేడెక్కింది. ఈ రాజధాని బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఆయన నిర్ణయం తీసుకున్నారన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో రాజధాని మార్పు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల వ్యవహారంపై ప్రధాన మంత్రి కార్యాలయం ఆరా తీసినట్లు 'ఈనాడు' తన కథనంలో పేర్కొంది. దాని ప్రకారం.. గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు సంబంధించి వివరాలు కోరింది. గవర్నర్‌కు ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి, అమరావతి జేఏసీ నేత జి.వి.ఆర్ శాస్త్రి పీఎంవోకు లేఖ రాశారు. దానిపై స్పందించిన ప్రధాన మంత్రి కార్యాలయం.. గవర్నర్‌ కార్యాలయాన్ని వివరాలు అడిగినట్లు సమాచారం.

రాజధాని ఏర్పాటు కేంద్రం పరిధిలోని అంశం. హైకోర్టు నోటిఫికేషన్‌ రాష్ట్రపతి ఆమోదం ద్వారా జరిగింది. రాజధాని మార్చడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, హోం మంత్రికి లేఖలు రాశాం.చట్ట ప్రకారం రాజధాని మార్చడం ఎలా సాధ్యం కాదో కూడా పీఎంవో కార్యాలయానికి వివరించాం. దీనిపై అటార్నీ జనరల్‌ న్యాయ సలహా కూడా తీసుకోవాలని కేంద్రాన్ని కోరాం. లేఖపై స్పందించిన పీఎంవో మరి కొన్ని వివరాలు అడిగింది. ఆమేరకు వివరాలు కూడా సమర్పించాం.
జీవీఆర్‌ శాస్త్రి


ఏపీలో మూడు రాజధానుల తీసుకురావాలని ఇప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. విశాఖను కార్యనిర్వాహక రాజధాని, అమరావతిని శాసన వ్యవహారాలు, కర్నూలును జ్యుడీషియరీ క్యాపిటల్‌గా ప్రకటించారు.

ఐతే ఆ బిల్లులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు చేరిన విషయం తెలిసిందే. నెల రోజుల క్రితం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ రెండు బిల్లులను ఏపీ అసెంబ్లీలో రెండోసారి ఆమోదించి వాటిని శాసనమండలికి పంపారు. వాటిని శాసనమండలి ఆమోదించలేదు. నిబంధనల ప్రకారం అసెంబ్లీ నుంచి వచ్చిన బిల్లు నెల రోజులు గడిచింది కాబట్టి దాన్ని ఆమోదించాల్సిందిగా అసెంబ్లీ అధికారులు గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్‌కు పంపారు. దీనిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని ఆసక్తిగా మారింది. ఈ అంశంపై నాన్చుడు ధోరణి అవలంభిస్తారా? లేకపోతే వెంటనే ఆమోదం తెలుపుతారా? లేకపోతే న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ఓ నిర్ణయం తీసుకుంటారా? అనే చర్చ జరుగుతోంది.
Published by: Shiva Kumar Addula
First published: July 23, 2020, 1:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading