Home /News /andhra-pradesh /

PM MODI SPEAKS AP CM YS JAGAN ON CYCLONE GULAB EVK

Gulab Cyclone: గులాబ్‌ తుఫాన్ ప‌రిస్థితిపై సీఎం జ‌గ‌న్‌తో మాట్లాడిన ప్ర‌ధాని మోదీ

ప్రధాని మోదీ (Photo: ANI / Twitter)

ప్రధాని మోదీ (Photo: ANI / Twitter)

గులాబ్ తుఫాన్‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆంధ్రప్ర‌దేశ్ (Andhra Pradesh) ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డితో మాట్లాడారు. త‌క్ష‌ణ‌మే సాయం అందేలా చూస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ఈ విష‌యానికి సంబంధించి స‌మాచారాన్ని ప్ర‌ధాని మోదీ (PM Modi) ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలుగులో ట్వీట్ చేశారు.

ఇంకా చదవండి ...
    వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సెప్టెంబ‌ర్ 25, 2021 సాయంత్రం 5.30 గంటల సమయంలో 'గులాబ్‌ తుఫాను (Gulab Cyclone)గా మారిన సంగతి తెలిసిందే. ఇది గోపాల్‌పూర్‌కు తూర్పు ఆగ్నేయంగా 180 కి.మీ, కళింగపట్నానికి తూర్పుగా 240 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమై ఉంద‌ని భారత వాతావరణ శాఖ (IMD) ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల‌కు రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం అంచ‌నా ప్ర‌కారం గులాబ్ తుఫాను సెప్టెంబర్ 26 (ఆదివారం) అర్ధరాత్రి సమయంలో గోపాల్‌పూర్ మరియు కళింగపట్నన్ తీరాల మధ్య గంటకు గరిష్టంగా 75 నుంచి 85 కిమీ వేగంతో గాలుల వేగంతో దూసుకెళ్తుందని IMD బులెటిన్ పేర్కొంది. ఈ విష‌యంపై ప్ర‌ధాని మోదీ స్పందించారు.



    గులాబ్ తుఫాన్‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డితో మాట్లాడారు. త‌క్ష‌ణ‌మే సాయం అందేలా చూస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ఈ విష‌యాన్ని ప్ర‌ధాని స్వ‌యంగా ట్విట్ట‌ర్‌లో తెలుగులో పేర్కొన్నారు. ఇప్ప‌టికే.. ఒడిశాలోని ఏడు జిల్లాల కలెక్టర్లు, గంజాం, కోరాపుట్, మల్కన్‌గిరితో సహా, గులాబ్ తుఫాను ప్ర‌భావితం చేసే మార్గాల‌ను అప్రమ‌త్తం చేయాల‌ని సూచించారు.

    Gulab Cyclone: ముంచుకొస్తున్న గులాబ్ తుఫాన్.. ఈ స‌మ‌యంలో చేయాల్సిన‌వి ఇవే..


    ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రితో ప్ర‌ధాని మాట్లాడి సాయం అందిస్తాన‌ని పేర్కొన్నారు.

    ఉత్త‌రాంధ్ర జిల్లాలు ప్ర‌భావితం అయ్యే అవ‌కాశం..
    గులాబ్ తుఫాను కార‌ణంగా ఉత్తరాంధ్ర, ఒడిశాలోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. దీని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్రంగా ఉండనుందని అధికారులు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కోస్తాంధ్ర జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, సోంపేట, గంజాం జిల్లాల్లో మీటరు ఎత్తు వరకూ అలలు ఎగసిపడతాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండనున్న కారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార కుటుంబాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విశాఖ జిల్లా తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దంటూ అధికారులు పేర్కొన్నారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Cyclone, Pm modi, PM Narendra Modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు