విపక్షాల నిరసనల మధ్యే రాజ్యసభలో ప్రధాని మోదీ (PM Modi) ప్రసంగం కొనసాగుతుంది. అదానీ వ్యవహారంపై జేపీసీకి విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నినాదాలు చేసిన విపక్షాలు మోదీ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనితో ప్రధాని మోదీ (PM Modi) విపక్షాలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. విపక్షాల తీరు చూస్తుంటే బాధగా ఉంది. దేశ ప్రగతిని కాంగ్రెస్ నాశనం చేసింది. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ హయాంలో పాలన శుద్ధ దండగ అని ప్రధాని విమర్శలు గుప్పించారు. నేను కాంగ్రెస్ పాలనను నిశితంగా పరిశీలించాను.
ఇతర దేశాలు అభివృద్ధి చెందితే, భారత్ మాత్రం అభివృద్ధి చెందలేదు. ఏ ఒక్క సమస్యకు కూడా కాంగ్రెస్ శాశ్వత పరిష్కారం చూపలేదు. వాళ్లు సమస్యలకు పైపూత పూశారు. కానీ మేము దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాం. దేశ ప్రజలు కాంగ్రెస్ పాలనను నిరాకరిస్తున్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మారు. కానీ దేశ ప్రజల్ని కాంగ్రెస్ వంచించింది. కానీ మా పాలనలో ప్రజలకు మళ్లీ నమ్మకం కలిగించాం. జనం డబ్బు మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్ళింది. గరీబ్ హఠావో అనేది కాంగ్రెస్ పార్టీకి ఓ నినాదం మాత్రమే. కాంగ్రెస్ కు ప్రజా సమస్యలపై చర్చించాలనే చిత్తశుద్ధి లేదన్నారు.
మేం వికాసాన్ని నమ్ముతాం..విపక్షాన్ని కాదు..
మేము వికాసాన్ని నమ్ముతాం. కానీ విపక్షాన్ని కాదని ప్రధాని మోదీ రాజ్యసభలో అన్నారు. మేము దేశం కోసం రాత్రి, పగలు కష్టపడుతాం. 18 వేల గ్రామాలకు కరెంట్ ఇచ్చి వెలుగులు నింపినం. మీరు విసిరే బురదలో కూడా కమలం వికసిస్తుంది. కొంతమంది ఎంపీల ప్రవర్తన బాధ కలిగిస్తుంది. 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కేవలం గుంతలను మాత్రమే తవ్వింది. మేము దేశ ప్రగతి కోసం నిత్యం శ్రమిస్తున్నాం. సాంకేతిక సాయంతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నాం. మేము నిజమైన లౌకికవాదాన్ని అనుసరిస్తాం అని ప్రధాని అన్నారు.
నేనెప్పుడూ రాజకీయ లబ్ది చూసుకోలేదు..
తానెప్పుడూ రాజకీయ లబ్ది కోసం చూసుకోలేదని ప్రధాని మోదీ ప్రసంగంలో పేర్కొన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రజలను భాగస్వామ్యులను చేశాం. మా పథకాలు దేశ ప్రగతిని మార్చాయి. కాంగ్రెస్ చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తుంది. ఇక ఆదివాసీల గురించి కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి గిరిజనులకు బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించాము. లక్షా 20 వేల కోట్ల నిధులు కేటాయించామని అన్నారు. ఇలా విపక్షాల నిరసనల మధ్య ప్రధాని మోదీ ప్రసంగం కొనసాగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Narendra modi, PM Narendra Modi, Rajyasabha