మోదీ, జగన్ ‘ట్రెండ్ సెట్టర్స్’.. సోషల్ మీడియాలో దుమ్మురేపిన లీడర్స్.. ర్యాంక్స్ ఎంతంటే

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్రెండ్ సెట్టర్స్. ఔను. మీరు చదివింది కరెక్టే. మోదీ, జగన్ ఇద్దరూ సోషల్ మీడియాలో ట్రెండ్స్ సెట్ చేశారు.

news18-telugu
Updated: November 24, 2020, 2:43 PM IST
మోదీ, జగన్ ‘ట్రెండ్ సెట్టర్స్’.. సోషల్ మీడియాలో దుమ్మురేపిన లీడర్స్.. ర్యాంక్స్ ఎంతంటే
ప్రధాని మోదీ, జగన్ (File)
  • Share this:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్రెండ్ సెట్టర్స్. ఔను. మీరు చదివింది కరెక్టే. మోదీ, జగన్ ఇద్దరూ సోషల్ మీడియాలో ట్రెండ్స్ సెట్ చేశారు. ఈ సంవత్సరం ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో సోషల్ మీడియా ( ట్విటర్, యూట్యూబ్ , గూగుల్ సెర్చ్) ట్రెండ్స్‌ను చెక్ బ్రాండ్స్ సంస్థ రిలీజ్ చేసింది. ఆ ట్రెండ్స్‌లో ప్రధాని మోదీ టాప్‌లో నిలిచారు. వైఎస్ జగన్ రెండో స్థానం దక్కించుకున్నారు. దేశంలోని టాప్ 95 రాజకీయ నాయకులు , 500 మంది అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులకు సంబంధించిన ఆన్‌లైన్‌ ట్రెండ్స్‌‌ను విశ్లేషించి చెక్‌బ్రాండ్స్ సంస్థ వెల్లడించింది. వాటిలో ప్రధాని మోదీ పేరుతో 2171 ట్రెండ్స్ రికార్డు అయ్యాయి. అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంల్లోనూ మోదీ హవా కొనసాగింది. మోదీ తర్వాత జగన్ రెండో స్థానంలో నిలిచారు. జగన్ పేరుపై దాదాపు 2137 ఆన్‌లైన్ ట్రెండ్స్ నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ,కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.

చెక్‌బ్రాండ్ అనేది ఆన్ లైన్ ట్రెండ్స్‌ను పరిశీలించే సంస్థ. ఏ రోజు ఏ సమయంలో ఏ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయిందనే అంశాన్ని ఆ సంస్థ పరిశీలిస్తూ ఉంటుంది. ఆ సంస్థ ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలానికి సంబంధించి రిపోర్టును రిలీజ్ చేసింది. చెక్ బ్రాండ్ 100 మిలియన్ల ఆన్ లైన్లు ఇంప్రెషన్లు పరిశీలించింది. ఇది ఆ సంస్థ జారీ చేసిన మొదటి రిపోర్ట్.

‘ప్రధాని నరేంద్ర మోదీ అన్ని సోషల్ మీడియా ట్రెండ్స్‌లోనూ (ట్విటర్, గూగుల్ సెర్చ్, వికీ, యూట్యూబ్, మొదలైనవి) హవా చూపించారు. ఆగస్టు - అక్టోబర్ త్రైమాసికంలో 2171 ట్రెండ్స్ మోదీ పేరు మీద నడిచాయి. 2137 ట్రెండ్స్‌తో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆ తర్వాత స్థానంలో నిలిచారు.’ అని ఆ సంస్థ జారీ చేసిన నివేదికలో పేర్కొంది.


చెక్ బ్రాండ్స్ సంస్థ 86,400 ట్రెండ్స్ పరిశీలించింది. ఒక రోజులో ఎక్కువసేపు ట్రెండింగ్‌లో నిలిచిన 20 టాప్ ట్రెండింగ్ టాపిక్స్‌ను విశ్లేషించింది. చెక్ బ్రాండ్ రిపోర్టు ప్రకారం ప్రధాని మోదీ బ్రాండ్ స్కోర్ 70. ఆ తర్వాత స్థానంలో ఉన్న నేతకంటే సుమారు రెండింతలు ఎక్కువ. బ్రాండ్ స్కోర్ అనేదాన్ని ఐదు అంశాలను ఆధారంగా చేసుకుని లెక్కించారు. ఫాలోయర్లు (20), ట్రెండ్స్ (10), సెంటిమెంట్ (30), సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్ (20), మెన్షన్స్ (20) ఆధారంగా చేసుకుని బ్రాండ్ స్కోర్ ఇచ్చారు.

బ్రాండ్ స్కోర్‌లో ప్రధాని మోదీ తర్వాత అమిత్ షా (బ్రాండ్ స్కోర్ 36.43) ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ (31.89), అరుణాచల్ ప్రదేశ్ సీఎం ప్రేమా ఖండు (31.89) యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (27.03) ఉన్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే 40,000 మెన్షన్స్ ఉన్నాయి.


బ్రాండ్ వాల్యూను డబ్బు పరంగా లెక్కిస్తే ప్రధాని మోదీ రూ.336 కోట్లు, అమిత్ షా రూ.335 కోట్లు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 328 కోట్లగా చెక్ బ్రాండ్స్ లెక్కించింది. బ్రాండ్ వాల్యూ అనేది ఫాలోయర్లు, సోషల్ మీడియా ఎంగేజ్‌‌మెంట్, ట్రెండ్స్, నెగిటివ్ మెన్షన్స్, సెంటిమెంట్స్ ఆధారంగా లెక్కించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 24, 2020, 2:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading