• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • PM KISAN SCHEME ABOUT 2 CRORE FARMERS TO GET 2ND INSTALLMENT FROM NEXT MONTH NK

ఏప్రిల్‌లో పీఎం కిసాన్ మనీ బదిలీ... 2 కోట్ల మంది రైతులకు ప్రయోజనం

ఏప్రిల్‌లో పీఎం కిసాన్ మనీ బదిలీ... 2 కోట్ల మంది రైతులకు ప్రయోజనం

ప్రతీకాత్మక చిత్రం

PM Kisan Scheme : రైతుల సంక్షేమానికి సంబంధించిన పథకానికి ఎన్నికల కోడ్ అడ్డంకులేవీ లేకపోవడంతో, సొమ్ము బదిలీ కాబోతోంది.

  • Share this:
లోక్‌సభ ఎన్నికల కోడ్ ఫిబ్రవరి 10 నుంచీ అమల్లోకి వచ్చింది. ఆ కోడ్ అమలుకి ముందు ప్రధాన మంత్రి కిసాన్ పథకం కింద 4.74 కోట్ల మంది రైతులు తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. వాళ్లలో కొంతమందికి ఇప్పటికే రూ.2 వేల చొప్పున రుణ సాయం అందింది. మిగతావారికి త్వరలో రెండో పంపిణీలో భాగంగా... రూ.2 వేల చొప్పున సాయం అందబోతోంది. రైతుల బ్యాంకు అకౌంట్లలో ఏప్రిల్ నుంచీ ఈ సొమ్ము జమ అవుతుందని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి చెప్పారు. ఈ 4.74 కోట్ల మంది రైతుల్లో ఇప్పటివరకు 2.74 కోట్ల మంది తొలి దశ పంపిణీలో మనీ అందుకున్నారు. మిగతా రైతులకు ఈ నెలాఖరులోగా రూ.2000 సొమ్మును అందజేయబోతున్నారు.

ఈ నెల 10కి ముందు పీఎం కిసాన్ పథకం కింద పేర్లు రాయించుకున్న లబ్ధిదారులకు కేంద్ర వ్యవసాయ శాఖ తొలి రెండు పంపిణీల సొమ్ము బదిలీకి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అనుమతి ఇచ్చింది. కొన్ని నెలల కిందట కేంద్ర ప్రభుత్వం రూ.75 వేల కోట్లతో ఈ పథకాన్ని ప్రకటించింది. జనవరి 24న ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రారంభించింది. దీని ద్వారా రైతులు... పంటకు కావాల్సిన ఎరువులు లేదా ఇతరత్రా కొనుక్కునేందుకు వీలవుతుంది.

రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా ఇలాంటి పథకాలు అమలు చేస్తున్నాయి. అవి కూడా రైతులకు కొంత వరకూ మేలు చేస్తున్నాయి. ఐతే... వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు మాత్రం రావట్లేదు. ఇజ్రాయెల్, జపాన్ తరహా వ్యవసాయ పద్ధతుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అలవాటు చెయ్యాలని నిపుణులు కోరుతున్నారు. అలా చెయ్యకుండా ఇలాంటి రుణ మాఫీ పథకాలు ఎన్ని తెచ్చినా, వ్యవసాయరంగం లాభసాటిగా అయ్యే అవకాశాలు తక్కువేనని అంటున్నారు.

 

ఇవి కూడా చదవండి :

ఇవేం నామినేషన్ పత్రాలు నాయనో... కే ఏ పాల్ పేపర్లు చూసి తలలు పట్టుకుంటున్న అధికారులు...

దక్షిణ బెంగళూరుకు అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్... ప్రధాని మోదీ దక్షిణ బెంగళూరుకు పోటీ చేస్తారా?

దక్షిణాదిపై జాతీయ పార్టీల చూపు... సీట్లు పెంచుకోవడమే లక్ష్యం... అధినేతలు సౌత్‌లో పోటీ చేస్తారా

సైలెంట్‌గా విజృంభిస్తున్న టీబీ... క్షయ వ్యాధి లక్షణాలేంటి... రాకుండా ఏం చెయ్యాలి
First published:

అగ్ర కథనాలు