Home /News /andhra-pradesh /

Ongole boy kidnap : నా బిడ్డను రక్షించండి...! కిడ్నాప్‌కి గురైన బాలుడి తండ్రి వేడుకోలు..

Ongole boy kidnap : నా బిడ్డను రక్షించండి...! కిడ్నాప్‌కి గురైన బాలుడి తండ్రి వేడుకోలు..

న్యూస్18‌తో మాట్లాడుతున్న బాలుడి తండ్రి

న్యూస్18‌తో మాట్లాడుతున్న బాలుడి తండ్రి

Ongole boy kidnap :  ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం రెడ్డి నగర్‌లో నెల రోజుల క్రితం కిడ్నాప్‌కి గురైన బాలుడి తల్లిదండ్రులు అశోక్ రెడ్డి, నాగజ్యోతి తమ బిడ్డను రక్షించాలని పోలీసులను వేడుకుంటున్నారు.

  Ongole boy kidnap :  ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం రెడ్డి నగర్‌లో నెల రోజుల క్రితం కిడ్నాప్‌కి గురైన బాలుడి తల్లిదండ్రులు అశోక్ రెడ్డి, నాగజ్యోతి తమ బిడ్డను రక్షించాలని పోలీసులను వేడుకుంటున్నారు. అందులో భాగంగా.. ఈ రోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్‌ని కలవడానికి ఒంగోలు కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు బాలుడి తల్లిదండ్రులు. అయితే కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో.. ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. కిడ్నాప్ అయిన బాలుడి వివరాలు తెలుసుకున్న కలెక్టర్... జాయింట్ కలెక్టర్‌ని కలవమని సూచించట్లు తెలిపాడు బాలుడి తండ్రి. ఆయన మాట్లాడుతూ.. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, తమ కుమారుడు కిడ్నాప్ అయిన రోజుకు ముందు రోజు.. తమ గ్రామంలో ఓ పురుషుడు, మహిళ అనుమానాస్పదంగా తిరిగారని, ఈ విషయం ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌసల్ కి కూడా తెలిపామని బాలుడి తల్లిదండ్రులు News18కు తెలిపారు. తమ బిడ్డను రక్షించాలని జిల్లా పోలీస్ అధికారులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

  అది అలా ఉంటే.. తూర్పు గోదావరి జిల్లా... మండపేటలో నాలుగు రోజుల కిందట కిడ్నాపైన నాలుగేళ్ల పిల్లాడు జషిత్ క్షేమంగా తల్లితండ్రుల్ని చేరాడు. తెల్లవారుజామున పిల్లాణ్ని కిడ్నాపర్స్ రాయవరం మండలం కుతుకులూరు దగ్గర వదిలి పారిపోయినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు... ఆ చిన్నారిని కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. కన్నీరు మున్నీరౌతోన్న తల్లి... జషిత్‌ను దగ్గరకు తీసుకొని... ఆప్యాయంగా హత్తుకుంది. పిల్లాడు క్షేమంగా తమ దగ్గరకు చేరడంతో... తమకు సహకరించిన పోలీసులకు, మీడియాకూ, సోషల్ మీడియాకూ కృతజ్ఞతలు తెలిపారు జషిత్ తల్లిదండ్రులు. పోలీసులు కూడా మీడియా, సోషల్ మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.  అల ా తూర్పు గోదావరి జిల్లా బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. అయ్యింది. మరీ ఒంగోలు బాలుడి కిడ్నాప్ ఎన్ని మలుపులు తిరుగుతునుందో.. అయితే.. కిడ్నాప్ అయిన బాలుడి తల్లిదండ్రులు మాత్రం తమ చిన్నారి తమ కళ్ల ముందు కనపడక పోవడంతో తీవ్ర క్షోభను అనుభవిస్తున్నారు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: AP News, Kidnap, Ongole

  తదుపరి వార్తలు