తిరుమల శ్రీవారి ఆస్తుల వేలంపై ఏపీ హైకోర్టులో పిల్

భవిష్యత్‌లోనూ టీటీడీ ఆస్తులను వేలం వేయకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు. ఈ పిల్‌పై రేపు హైకోర్టు విచారించనుంది.

news18-telugu
Updated: May 26, 2020, 4:28 PM IST
తిరుమల శ్రీవారి ఆస్తుల వేలంపై ఏపీ హైకోర్టులో పిల్
ఈ నెల 8 నుంచి ట్రయల్ రన్ పద్ధతిన శ్రీవారి దర్శనాలు ఉంటాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
  • Share this:
తిరుమల శ్రీవారి ఆస్తుల వేలం వ్యవహారంపై ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజ వ్యాజ్యం దాఖలయింది. ఆస్తులను వేలం వేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని బీజేపీ నేత జంగటి అమర్ నాథ్ కోరారు. 2016లో అప్పటి టీటీడీ బోర్డు తీర్మానించిన 50 ఆస్తులను వేలం వేయకుండా మాత్రమే ఏపీ ప్రభుత్వం ఆపిందని.. ఆ ప్రక్రియను నిలుపుదల చేస్తూ జీవో జారీ చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కానీ ప్రస్తుత బోర్డు గుర్తించిన 23 ఆస్తుల వేలంను మాత్రమే ఆపలేదని తెలిపారు. ఆ పక్రియను కూడా నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిిటిషనర్ విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌లోనూ టీటీడీ ఆస్తులను వేలం వేయకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు. ఈ పిల్‌పై రేపు హైకోర్టు విచారించనుంది.

కాగా, టీటీడీ భూముల విక్రయాలను నిలిపివేస్తూ సోమవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2016 జనవరి 30 టీటీడీ బోర్డు తీర్మానాన్ని నిలిపివేసింది. నాడు చేసిన తీర్మానంలో తిరుమల శ్రీవారికి చెందిన 50 భూములను విక్రయించాలని అప్పటి బోర్డు నిర్ణయించింది. ఆ తీర్మానాన్ని తాజాగా నిలిపివేసింది ఏపీ సర్కార్. భూముల విక్రయానికి సంబంధించి ధార్మిక సంస్థలు, ఆధ్యాత్మిక వేత్తలతో సంప్రదింపులు జరపాలని ఉత్తర్వులో వెల్లడించింది. సంప్రదింపులు పూర్తయ్యే వరకు భూముల విక్రయ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలని టీటీడీకి సూచించింది ఏపీ ప్రభుత్వం.
First published: May 26, 2020, 4:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading