Viral Video: బ్రహ్మంగారు చెప్పిందే జరిగింది.. పంది పిల్లలకు పాలిచ్చిన ఆవు.. ఎక్కడో తెలుసా..?

పంది పిల్లకు పాలిస్తున్న ఆవు

సమాజంలో నిత్యం ఎన్నో వింతలు జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని మాత్రం క్షణాల్లో వైరల్ గా మారుతాయి.. తాజాగా ఓ ఆవు .. పంది పిల్లలకు పాలిచ్చిన ఘటన వైరల్ గా మారింది. ఇంతకీ ఎక్కడో తెలుసా..?

  • Share this:
    సమాజంలో చాలా వింతలు.. అద్భుతాలు జరుగుతుంటాయి.. అసలు ఎప్పుడూ జరగనవి.. మన ఊహకు అందనివి కూడా అప్పుడప్పుడూ కనిపిస్తాయి. ప్రతి నిత్యం ఎక్కడో చోట.. ఏదో ఒక వింత సంఘటనలు వెలుగులోకి వస్తుంటాయి... అలాంటి వీడియోలు క్షణాల్లో వైరల్ గా మారుతాయి. తాజాగా అలాంటి వింత సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది. ఆ ఆవెు ప్రవర్తిస్తున్న తీరు చూస అంతా షాక్ అవుతున్నారు. అప్పుడెప్పుడో బ్రహ్మంగారు చెప్పినట్టు ఓ ఆవు.. పంది పిల్లలకు పాలు పట్టిస్తోంది. ఈ విచిత్రాన్ని చూసిన స్థానికులు, ప్రయాణికులు ఆశ్చర్య పోతున్నారు. కాసేపీ ఆక్కడే ఆగి ఆ వింతను చూస్తూ చర్చించుకుంటున్నారు. వివరాల్లోకెళితే.. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పట్టణ బస్టాండ్ ఆవరణ లో ప్రతి రోజూ కొన్ని ఆవులు సంచరిస్తుంటాయి. ఆకులు, పేపర్లు తింటూ అక్కడే ఖాళీ ప్రదేశంలోనే రాత్రుల్లో నిద్రిస్తుంటాయి. ఎప్పటిలానే ఓ ఆవు అక్కడకు వచ్చి పడుకుంది.. అయితే అలా నిద్రలో ఉన్న ఆవును చూసిన పంది పిల్ల తన ఆకలి తీర్చుకోవాలి అనుకుంది..

    సాధరణంగా అదే ప్రదేశంలో పందులు బాగా సంచరిస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఆవులు సేద తీరుతున్న చోటే ఆ పందులు కూడా సేదతీరుతాయి. ఓ వైపు అవులు గుంపులుగా నిదురిస్తే.. మరోవైపు పందుల గుంపు నిదురిస్తుంది. తెల్లవారే వరకు అన్నీ అక్కడే ఉంటాయచి. ఈ క్రమంలో తాజాగా ఆవు నిద్రిస్తుండగా.. పందులు దాని చెంతకు చేరాయి. ఆ సమయంలో కొన్ని పందులు వింతగా ప్రవర్తించాయి.

    హాయిగా.. మంచి నిద్రలో ఉండి సేదతీరున్న ఆ ఆవు పొదుగు చుట్టూ పందిపిల్లలు చేరాయి. అలా అవి ఆవు పాలు తాగాయి. కాస్త టేస్ట్ గా అనిపించడంతో అవి నిత్యం ఇక ఆవుపాలు తాగడం ప్రారంభించాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే తమ సెల్‌ఫోన్‌లకు పని చెప్పారు. వీడియోలు, ఫోటోలు తీశారు. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ వింత సంఘటనను చూసిన జనాలు బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని గుర్తు చేసుకున్నారు. ఇటీవల విశాఖపట్నంలో కూడా వింత ఘటనే జరిగింది. ఓ వీధి కుక్క.. అమ్మలేని రెండు పిల్లి పిల్లలకు పాలివ్వడం వైరల్ గా మారింది. తాజాగా ఇప్పుడు ఓ ఆవు.. పంది పిల్లలకు పాలివ్వడం వైరల్ అవుతోంది.
    Published by:Nagesh Paina
    First published: