Home /News /andhra-pradesh /

PETITION AGAINST CHANDRABABU NAIDU IN AP HIGH COURT FOR LOCKDOWN VIOLATIONS AK

చంద్రబాబు అలా చేశారు... హైకోర్టులో పిల్ దాఖలు

ఓం ప్రతాప్ మృతికి వైసీపీ నేతలే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఓం ప్రతాప్ మృతికి వైసీపీ నేతలే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది.

    టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే సమయంలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆయనపై హైకోర్టులో పిల్ దాఖలైంది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘన కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్ధన్‌రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ ర్యాలీలపై నిషేధం ఉన్నప్పటికీ.. చంద్రబాబు ఆ విషయాన్ని పట్టించుకోలేదని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి జరిగేలా చంద్రబాబు వ్యవహరించాడని తెలిపారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు భారీ కాన్వాయ్‌తో ప్రయాణించిన చంద్రబాబు.. మార్గమధ్యంలో పలుచోట్ల జనసమీకరణ, బైక్‌ ర్యాలీలతో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారని పిటిషన్‌లో ప్రస్తావించారు.

    చంద్రబాబు క్రిమినల్‌ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు రెండు నెలల విరామం తర్వాత చంద్రబాబు సోమవారం ఏపీలో అడుగుపెట్టారు. ఏపీ పోలీసు శాఖ ఇచ్చిన ప్రత్యేక అనుమతితో సోమవారం ఉదయం హైదరాబాద్‌లో బయలుదేరిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉండవల్లిలోని తమ నివాసానికి చేరుకున్నారు. మార్గమధ్యంలో పలుచోట్ల టీడీపీ నాయకులు చంద్రబాబుకు స్వాగతం పలికారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, AP High Court, Chandrababu naidu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు