పెథాయ్ ఎఫెక్ట్ ... కాకినాడలో నిలిచిన విద్యుత్ సరఫరా

ప్రతి సబ్ స్టేషన్ పరిధిలో 500 మంది సిబ్బంది పనిచేసేలా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. మొత్తం 2 వేల మందిని అందుబాటులో ఉంచినట్టు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: December 17, 2018, 9:50 AM IST
పెథాయ్ ఎఫెక్ట్ ... కాకినాడలో నిలిచిన విద్యుత్ సరఫరా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో పెథాయ్ తుఫాను ప్రభావం మొదలయ్యింది. మధ్యాహ్నం కాకినాడ వద్ద తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. తుఫారు తీరం దాటే సమయంలో జనం ఎవరూ బయటకు రాకూడదంటూ హెచ్చరించారు. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

మరోవైపు సీఎం కూడా తుఫాను ఎదుర్కొనేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. కాకినాడలో విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడారు సీఎం. విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. తుఫాను తీరం దాటిన వెంటనే అధికారులంతా అందుబాటులోకి వచ్చి సహాయక చర్యల్ని ప్రారంభించాలని ఆదేశించారు.

రాయలసీమ, నెల్లూరు జిల్లాల నుంచి తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాలకు సహాయ బృందాలను పంపినట్టు తెలిపారు ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్. ఐదు వేల విద్యుత్ స్తంభాలు సిద్ధంగా ఉంచామన్నారు. మరో 5 వేల స్తంభాలు కూడా రెడీ చేస్తున్నామన్నారు. ప్రతి సబ్ స్టేషన్ పరిధిలో 500 మంది సిబ్బంది పనిచేసేలా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. మొత్తం 2 వేల మందిని అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.

విద్యుత్ పునరుద్ధరణకు అవసరమైన క్రేన్లు, జేసీబీలు, పోల్ డిగ్గింగ్ యంత్రాలను ఇప్పటికే ఉత్తరాంధ్రకు చేరాయి. విశాఖపట్టణం, కాకినాడ, ఏలూరు, మంగళగిరి, వెంకటగిరి ప్రాంతాలకు 20 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపినట్టు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వరప్రసాద్‌ తెలిపారు. మరోవైపు సమాచార వ్యవస్థపై కూడా అధికారులు నిఘా పెట్టారు. తుఫాను ప్రభావంతో సమాచార వ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు చేపట్టారు. తుపాను పీడిత ప్రాంతాల్లో 800 సెల్‌ టవర్లు ఉన్నట్లు గుర్తించారు. కాకినాడ డివిజన్‌లో 469 టవర్లు, అమలాపురం డివిజన్‌లో 331 టవర్ల వద్ద జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ అవి దెబ్బతిన్నా తక్షణ మరమ్మతులకు రంగం సిద్ధం చేశారు.
Published by: Sulthana Begum Shaik
First published: December 17, 2018, 7:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading