పెథాయ్ తుఫాను ఎఫెక్ట్‌తో రైళ్లు రద్దు... విమానాలు ఆలస్యం

జన్మభూమి, సింహాద్రి రత్నాచల్, ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు చేశారు రైల్వే శాఖ అధికారులు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ- విశాఖ ఇండిగో విమానం హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యింది. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దాదాపు 14 విమానాలు రద్దు చేశారు అధికారులు.

news18-telugu
Updated: December 17, 2018, 2:08 PM IST
పెథాయ్ తుఫాను ఎఫెక్ట్‌తో రైళ్లు రద్దు... విమానాలు ఆలస్యం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పెథాయ్ తుఫాను ప్రభావంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటుంది. తుఫాను ప్రభావంతో పలు రైళ్లను కూడా రద్దు చేసింది రైల్వే శాఖ. జన్మభూమి, సింహాద్రి రత్నాచల్, ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు చేశారు.

అలాగే మెమూ ప్యాసింజర్లు... విజయవాడ- రాజమండ్రి, రాజమండ్రి- విశాఖ ప్యాసింజర్లు, విశాఖ- కాకినాడ పోర్టు, కాకినాడ పోర్టు-విజయవాడ, విజయవాడ- తెనాలి, తెనాలి- గుంటూరు ప్యాసింజర్లను రద్దు చేశారు. డెమూ ప్యాసింజర్లు.... రాజమండ్రి- భీమవరం, భీమవరం- నిడదవోలు, భీమవరం- విజయవాడ డెమూ ప్యాసింజర్‌, రాజమండ్రి- నరసాపురం, నరసాపురం- గుంటూరు, గుంటూరు- విజయవాడ, విజయవాడ- మచిలీపట్నం రైళ్లు రద్దు అయ్యాయి.

మరోవైపు విమాన  సర్వీసులపై పెథాయ్ ప్రభావం పడింది. ఈదురుగాలులతో ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించడం లేదు. దీంతో విశాఖకు రావాల్సిన పలు విమానాల్ని దారి మళ్లిస్తున్నారు అధికారులు. దీంతో విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. తుఫాను కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంలో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ- విశాఖ ఇండిగో విమానం హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యింది. అలాగే చెన్నై- విశాఖ విమానం తిరిగి చెన్నైకి పయనమైంది. అటు హైదరాబాద్- విశాఖ స్పైస్ జెట్ విమానం రద్దైంది. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దాదాపు 14 విమానాలు రద్దు చేశారు అధికారులు. దీంతో విశాఖ ఎయిర్‌పోర్టులో 700 మంది ప్రయాణికులు పడిగాపులు గాస్తున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: December 17, 2018, 10:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading