బంగాళాఖాతంలో తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం

మరో 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.

news18-telugu
Updated: December 15, 2018, 4:45 PM IST
బంగాళాఖాతంలో తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. అమలాపురం, కళింగపట్నం మధ్యలో తుఫాను తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తుఫాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులకు అందచేస్తుంది ఆర్టీజీఎస్. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తుంది. తుఫాను ప్రభావంతో పడవలు తీరంలోనే నిలిచిపోయాయి.

ప్రస్తుతం చెన్నైకి 775 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తూర్పుగోదావరి, ఉత్తర కోస్తాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 17 సాయంత్రం పెథాయ్‌ తీరం దాటనుంది. ఈ ప్రభావంతో మరో 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.

జిల్లాల్లో తుపాను పరిస్థితిని ఆర్టీజీఎస్ అంచనా వేస్తుంది. కోస్తా తీరం ప్రాంతంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. మచిలీపట్నం 08672 252486, గుడివాడ 08674 243697 ,నూజివీడు 08656 232717, విజయవాడ 08622 574454, ఏలూరు 1800 2331077, పెద్దాపురం 08852 241254 నెంబర్లతో హెల్ప్ లైన్‌లు ఏర్పాటు చేశారు. ఆర్టీజీఎస్‌లో తుపాను ప‌రిస్థితి ఎదుర్కోవ‌డానికి అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు వివరించారు. ప‌రిష్కార వేదిక 1100 కాల్ సెంట‌ర్ నుంచి తుపాను జాగ్రత్తల సందేశాలు జారీ చేయాలన్నారు.

Published by: Sulthana Begum Shaik
First published: December 15, 2018, 4:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading