యానాం-తుని మధ్య తుఫాను తీరం దాటే అవకాశం: ఆర్టీజీఎస్

ఈరోజు ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల లోపు తీరం దాటే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు

news18-telugu
Updated: December 17, 2018, 3:47 PM IST
యానాం-తుని మధ్య తుఫాను తీరం దాటే అవకాశం: ఆర్టీజీఎస్
ఏపీ వైపు దూసుకొస్తున్న పెథాయ్ తుఫాన్ (Image:Windy)
  • Share this:
కాకినాడ‌కు 125 కిలోమీట‌ర్ల దూరంలో తీవ్ర తుఫాను కేంద్రీక‌ృతమై ఉన్నట్లు ఆర్టీజీఎస్ తెలిపింది. తుపాన్ తూర్పుగోదావ‌రి జిల్లావైపు వేగంగా క‌దులుతుందని పేర్కొంది. గంట‌లకు 16 కిలోమీట‌ర్ల వేగంతో క‌దులుతున్న తుపాన్‌ ... ఈరోజు ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల లోపు తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుఫాను... యానాం నుంచి తుని మధ్య తీరం దాటనుంది.

గంట‌కు 100 నుంచి 110 కిలోమీట‌ర్ల వేగంతో కూడిన ఈదుడు గాలుల‌తో తుఫాను తీరం దాట‌నున్నట్లు ఆర్టీజీఎస్ తెలిపింది. తూర్పుగోదారి, పచ్చిమ గోదావరి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయి . తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బ‌ల‌మైన ఈదురు గాలులు గంట‌కు 110 నుంచి 110 కిలోమీట‌ర్ల వేగంతో వీస్తాయి. విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లో గంట‌కు 80 నుంచి 90 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తాయి

. తీరం దాటే స‌మ‌యంలో పెనుగాలుల‌తో కూడిన వ‌ర్షం విరుచుకుపడుతుంది.

ప్ర‌జ‌లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌గా ఉండాలని హెచ్చరించింది ఆర్టీజీఎస్. అర‌టి రైతులు, ఉద్యానవ‌న రైతులు జాగ్ర‌త్త‌ల్లో ఉండాలని సూచించింది. వ‌రి, జొన్న‌, త‌దిత‌ర ధాన్యాల‌ను కోసిన‌వారు వాటిని త‌క్ష‌ణం గోదాముల్లో భ‌ద్ర‌ప‌రచాలని తెలిపింది. పొలాల్లోనే ఇంకా ధాన్యం ఉంటే దానిపైన టార్పాలిన్ ప‌ట్ట‌లు క‌ప్పి భ‌ధ్ర‌ప‌ర‌చాలంది. వ్య‌వ‌సాయ శాఖ అధికారుల నుంచి రైతులు టార్పాలిన్ పట్టాలు పొంద‌వ‌చ్చని తెలిపింది.

గుడిసెల్లో, రేకుల షెడ్డుల్లో ఉన్న నివాస‌ముంటున్న వారిని వెంట‌నే పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ పేర్కొంది. లోత‌ట్టు ప్రాంత ప్ర‌జ‌ల‌ను త‌క్ష‌ణం సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాలంది. తుపాన్ తీరం దాటే వ‌ర‌కు ప్ర‌జ‌లు ఎవ‌రూ కూడా ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకూడ‌దని హెచ్చరించింది. రోడ్ల‌పై వాహ‌నాల్లో తిర‌గ‌రాదని, చెట్ల కింద త‌ల‌దాచుకోరాదని ఆర్గీజీఎస్ అధికారులు తెలిపారు. ముఖ్యంగా...తూర్పు గోదావ‌రి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం ప్ర‌జ‌లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌గా ఉండాలన్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: December 17, 2018, 10:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading