కాకినాడ-యానాం మధ్య తీరం దాటిన పెథాయ్ తుఫాను

తుఫాను తీరం దాటిన సమయంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కాకినాడపై తుఫాను ప్రభావం ఎక్కువగానే కనిపించింది

news18-telugu
Updated: December 17, 2018, 4:18 PM IST
కాకినాడ-యానాం మధ్య తీరం దాటిన పెథాయ్ తుఫాను
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పెథాయ్ తుఫాను తీరాన్ని దాటింది. కాకినాడ, యానం మధ్య తుఫాను తీరం దాటి ఒడిశా వైపుగా పయనించింది. తీరం దాటాక పెథాయ్ క్రమంగా బలహీనపడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.3.30గంటల సమయంలో కాకినాడ-యానం మధ్య తీరం దాటినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాగల 24గంటల్లో కోస్తాలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు

తుఫాను తీరం దాటిన సమయంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కాకినాడపై తుఫాను ప్రభావం ఎక్కువగానే కనిపించింది. ఈదురుగాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విశాఖ, కృష్ణా, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో చిరుజల్లులతో పాటు ఓ మోస్తారు వర్షాలు కురిసాయి.

మధ్యాహ్నం సుమారు 12.30 గంటల ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద తుఫాను తీరాన్ని తాకింది. దీంతో జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. పెథాయ్ తుఫాను తీరాన్ని తాకిన వెంటనే రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) హెచ్చరికలు జారీ చేసింది. రాజోలు, స‌ఖినేటిప‌ల్లి, అమ‌లాపురం, మ‌లికిపురం, అంబాజీపేట‌, మామిడికుదురు, అల్ల‌వ‌రం, కాట్రేనికోన, ఉప్ప‌ల‌గుప్తం మండ‌లాల్లో కుండ‌పోత వ‌ర్షాలు కురుసాయి. దీంతో ఆయా ప్రాంతల ప్ర‌జ‌లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌గా ఉండాలని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. మరోవైపు చలిగాలు తీవ్రత ఎక్కువగా ఉండటంతో వేటపాలెం, చీరాలలో ముగ్గురు వృద్ధులు మృతిచెందారు.
Published by: Sulthana Begum Shaik
First published: December 17, 2018, 4:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading