డాక్టర్లు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలి: మంత్రి కిడారి శ్రవణ్

పెథాయ్ తుఫాన్ నేపధ్యంలో గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం చేస్తున్నా ఏర్పాట్లపై ఐటిడిఏ పివోలతో,సబ్ కలెక్టర్ తో టెలికాన్ఫారెన్స్‌లో మంత్రి శ్రావణ్ కుమార్ మాట్లాడారు.

news18-telugu
Updated: December 17, 2018, 1:38 PM IST
డాక్టర్లు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలి: మంత్రి కిడారి శ్రవణ్
కిడారి శ్రవణ్ కుమార్(File)
  • Share this:
పెథాయ్ తుఫాను ప్రభావిత ప్రాంతలైన విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాధమిక ఆరోగ్య, కుటుంబ, గిరిజన సంక్షేమ శాఖలకు సంబంధించిన అధికారులంతా అలర్ట్‌‌గా ఉండాలన్నారు మంత్రి కిడారి శ్రావణ్ కుమార్. తుఫాను ప్రభావిత జిల్లాల్లోని డాక్టర్లు, వైద్యసిబ్బంది, అంబులెన్సులు, మందులు అందుబాటులో ఉంచాలని ఆరోగ్య శాఖ ఉన్నాతాధికారులను ఆదేశించారు.

లంక గ్రామాలతో పాటు తుఫాను ప్రభావిత గ్రామాలకు వైద్య సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని గర్భిణిలు, కిడ్ని రోగులు, వృద్ధులు, అత్యవసర సేవలు పొందుతున్న రోగులను సురక్షితంగా జిల్లా,ఏరియా ఆసుపత్రులకు తరలించినట్లుగా తెలిపారు. తుఫాన్ దృష్ట్యా విశాఖ కెజీహెచ్ లో భాదితుల కోసం అత్యవసర విభాగంలో ప్రత్యేకంగా బెడ్ లు ఏర్పాటు చేశారు.

పెథాయ్ తుఫాన్ నేపధ్యంలో గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం చేస్తున్నా ఏర్పాట్లపై ఐటిడిఏ పివోలతో,సబ్ కలెక్టర్ తో టెలికాన్ఫారెన్స్‌లో మంత్రి శ్రావణ్ కుమార్ మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం ఉన్నందున విరిగిన చెట్లు తోలగించేందుకు, విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పివో, సబ్ కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. తుఫాన్ ప్రాభావిత ప్రాంతాల్లోని గురుకుల పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వసతి గృహలనుండి పిల్లలు బయటకు రాకుండా భోజనం, త్రాగునీరుతో పాటు అన్ని వసతులను ఏర్పాట్లు చేశామన్నారు. డాక్టర్లు, వైద్యసిబ్బంది అత్యవసర పరిస్ధితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు మంత్రి కిడారి శ్రావణ్ కుమార్.
Published by: Sulthana Begum Shaik
First published: December 17, 2018, 12:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading