ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొండి...‘పెథాయ్‌’పై చంద్రబాబు సమీక్ష

తుఫాను ప్రభావంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో తుపాను ముంద‌స్తు స‌న్నద్ధత‌ల‌పై సీఎం ఆర్టీజీఎస్ నుంచి వివ‌రాలు తెలుసుకున్నారు.

news18-telugu
Updated: December 15, 2018, 11:56 AM IST
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొండి...‘పెథాయ్‌’పై చంద్రబాబు సమీక్ష
చంద్రబాబు (ఫైల్ ఫొటో)
  • Share this:
పెథాయ్ తుఫాను పరిస్థితిపై పరీక్షిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ముందస్తు సన్నద్ధతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారుల్ని ఆదేశించారు. ఆర్టీజీఎస్ నుంచి తుపాను వివరాలు తెప్పించుకున్నారు చంద్రబాబు.

తుఫాను ప్రభావంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర యంత్రాంగం స‌ర్వస‌న్నద్ధంగా ఉందని అధికారులు ఆయనకు వివరించారు. జిల్లాల్లో తుపాను ముంద‌స్తు స‌న్నద్ధత‌ల‌పై సీఎం ఆర్టీజీఎస్ నుంచి వివ‌రాలు తెలుసుకున్నారు. ప్రాణ‌న‌ష్టం లేకుండా చ‌ర్యలు తీసుకోవాల‌ని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి అనిల్ చంద్రపునేఠా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి యంత్రాంగంతో నిత్యం ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు.

తీవ్ర వాయుగుండం ఈ రోజు మ‌ధ్యాహ్నం తుపాను‌గా రూపాంత‌రం చెందే అవ‌కాశం ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. వాయుగుండం మార్పుల‌ను అనుక్షణం గ‌మ‌నించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు. ఆర్టీజీఎస్‌లో తుపాను ప‌రిస్థితి ఎదుర్కోవ‌డానికి అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు వివరించారు. ప‌రిష్కార వేదిక 1100 కాల్ సెంట‌ర్ నుంచి తుపాను జాగ్రత్తల సందేశాలు జారీ చేయాలన్నారు.

ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజ‌ల‌కు నిరంత‌రం హెచ్చరిక‌లు పంపాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. మ‌త్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా వారి పడవలు తీరంలోనే నిలిపివేయాలని సూచించారు. తుపాను సంబంధిత విభాగాల అధికారులు ఆర్టీజీఎస్‌లో ఉంటూ ప‌ర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. తుపాను నేప‌థ్యంలో రాత్రిపూట కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప‌నిచేయాలన్నారు సీఎం.

తిత్లీ తుపానుల సందర్భంగా ఎదురైన అనుభవాలను అధికారులకు గుర్తుచేసిన సీఎం.. మరోసారి అలాంటి పరిస్ధితులు ఎదురయ్యే అవకాశముందని తెలిపారు. ముఖ్యంగా ఎలాంటి ప్రాణనష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. కోస్తాంధ్ర జిల్లాల్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసినట్లు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.
Published by: Sulthana Begum Shaik
First published: December 15, 2018, 11:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading