కోస్తాంధ్రలో 50 అడుగులు ముందుకొచ్చిన సముద్రం

తూర్పుగోదావరి జిల్లాలో 17 మండలాలపై తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

news18-telugu
Updated: December 17, 2018, 9:49 AM IST
కోస్తాంధ్రలో 50 అడుగులు ముందుకొచ్చిన సముద్రం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పెథాయ్ ప్రభావంతో కోస్తాంధ్రలో వాతావరణం మారిపోయింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా చిరు జల్లులు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి పెద్ద పెద్ద అలలు ఎగిసి పడుతున్నాయి.


నెల్లూరు జిల్లాలోని తుమ్మలపెంట, కృష్ణా జిల్లాలోని హంసలదీవి, విజయనగరంలోని భోగాపురం, కాకినాడలోని ఉప్పాడలలో సముద్రం 50 అడుగుల మేర ముందుకొచ్చింది. నిజాంపట్నం ఓడరేవులో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 17 మండలాలపై తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 283 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆర్డీవో, తహసీల్దార్లకు అత్యవసర నిధులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. నిత్యావసర వస్తువులను మండల కేంద్రాలకు తరలించింది. సమాచార వ్యవస్థకు అంతరాయం కలగకుండా జనరేటర్లను అందుబాటులో ఉంచారు.

ఓడరేవులో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు


తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాలో 20, ప్రకాశం జిల్లాలో 14, పశ్చిమగోదావరి జిల్లాలో 6, విజయనగరం జిల్లాలో 2 మండలాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, కృష్ణా, విశాఖపట్టణం జిల్లాల వ్యాప్తంగా పాఠశాలలు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో తీరం వెంబడి 70-80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తీర ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: December 17, 2018, 8:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading