తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్.. పెథాయ్‌పై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

మూడురాష్ట్రాల సీఎంల ప్రమాణ స్వీకారోత్వానికి వెళ్తున్న చంద్రబాబు... సాయంత్రానికల్లా విశాఖకు చేరుకుంటాన్నారు. తుఫానును అత్యవసర పరిస్థితిగా భావించాలన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించాలని అధికారుల్ని ఆదేశించారు

news18-telugu
Updated: December 17, 2018, 11:21 AM IST
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్.. పెథాయ్‌పై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
చంద్రబాబు (ఫైల్ ఫొటో)
  • Share this:
పెథాయ్ తుపాను పరిస్థితిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎ చంద్రబాబు. విపత్తును ఎదుర్కోవడంపై ప్రతీ శాఖకూ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. జన నష్టం, పశునష్టం నివారించాలన్నారు. ప్రజల ఇబ్బందుల్ని తగ్గించాలని ఆదేశించారు. ముంపు గ్రామల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు సీఎం.

పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. తుఫానును అత్యవసర పరిస్థితిగా భావించాలన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించాలని అధికారుల్ని ఆదేశించారు చంద్రబాబు. అధికారులెవరూ సెలవులు పెట్టకుండా బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. తుఫాను సహయక చర్యల్లో ఆపద మిత్రులు భాగస్వామ్యం కావాలన్నారు. అధికారుల  పనితీరే ప్రామాణికమన్నారు సీఎం.  ప్రభుత్వానికి ఎక్కడా చెడ్డపేరు రాకూడదని హెచ్చరించారు. సాధ్యమైన త్వరగా సాధారణ స్థితి తీసుకురావాలన్నారు. ప్రతి గంటకు బులెటిన్ విడుదల చేయాలనీ,  ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు.

ముంపు గ్రామల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అల్పాహారం, భోజనం, తాగునీరు అందించాలన్నారు. పాలు,కూరగాయలతో పాటు నిత్యవసరాలన్నీ సిద్ధంగా ఉంచాలన్నారు సీఎం. టార్పాలిన్ పట్టాలు సిద్ధంగా ఉంచాలన్నారు. ధాన్యం సేకరణ కేంద్రాలు, వరికల్లాల వద్ద టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. మూడురాష్ట్రాల సీఎంల ప్రమాణ స్వీకారోత్వానికి  వెళ్తున్న చంద్రబాబు... సాయంత్రానికల్లా విశాఖకు చేరుకుంటానన్నారు. మంత్రులంతా మధ్యాహ్నానికల్లా మండలాలకు చేరుకోవాలని ఆదేశించారు.
Published by: Sulthana Begum Shaik
First published: December 17, 2018, 9:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading