Home /News /andhra-pradesh /

PERSON FROM ANDHRA PRADESH TESTS CORONA POSITIVE AFTER TAKING VACCINE NS

Andhra Pradesh: ఏపీలో వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి కరోనా.. 8 మంది కుటుంబ సభ్యులకు కూడా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Corona Vaccine: వ్యాక్సిన్ రావడంతో ఇక కరోనా ముగింపుకు వచ్చిందనే సంతోషం ప్రజల్లో వ్యక్తమవుతోంది. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొందరు అనారోగ్యానికి గురవడం, మరి కొందరు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

    కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఇటీవలే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ రావడంతో ఇక కరోనా ముగింపుకు వచ్చిందనే సంతోషం ప్రజల్లో వ్యక్తమవుతోంది. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొందరు అనారోగ్యానికి గురవడం, మరి కొందరు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కారణంగానే వారికి ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయా? లేదా అన్న అంశంపై క్లారిటీ రాకపోవడంతో అనేక మంది వ్యాక్సిన్ పనితీరుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ వ్యక్తికి పాజిటీవ్ గా తేలడంతో స్థానికులతో పాటు వైద్య సిబ్బంది ఉలిక్కిపడ్డారు. అతనితో పాటు ఆ వ్యక్తి కుటుంబంలోని 8 మందికి సైతం వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు.

    ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నానికి చెందిన ఓ వ్యక్తి తొలి విడత వ్యాక్సినేషన్ లో భాగంగా కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నాడు. అనంతరం అతనికి పరీక్షలు నిర్వహించడంతో అతనికి పాజిటీవ్ గా తేలింది. దీంతో ఆందోళన చెందిన వారి కుటుంబ సభ్యులు ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోవడంతో వారికి కూడా వైరస్ సోకినట్లు తేలింది. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి, అతని కుటుంబ సభ్యులకు పాజిటీవ్ గా నిర్ధారణ అవ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

    ఇదిలా ఉంటే.. భారత్‌పై ఐక్యరాజ్య సమితి ప్రశంసల జల్లు కురిపించింది. భారీ స్థాయిలో కరోనా టీకాలను ఉత్పత్తి చేయలగల భారత్ సామర్థ్యం ప్రపంచానికే ఓ పెద్ద ఆస్తిగా అభివర్ణించింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్‌పై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రాస్ మాట్లాడారు. కరోనా మహమ్మారి నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇండియా కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. అందుకు భారత్ సైతం సిద్ధంగా ఉన్నట్లు తాము భావిస్తున్నామని తెలిపారు. అక్కడ దేశీయంగా తయారవుతున్న వ్యాక్సిన్‌ల గురించి తమకు తెలుసన్న ఆంటోనియో.. ఆయా టీకా తయారీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అన్ని దేశాలకు కరోనా వ్యాక్సిన్ వీలైనంత త్వరగా చేరే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యస సమితి అభిప్రాయపడ్డారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Corona, Corona Possitive, Corona Vaccine

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు