Andhra pradesh : ఏవిధంగా ఇబ్బంది పెట్టామో పవన్ క‌ల్యాణ్ చెప్పాలి : మంత్రి పేర్నినాని

ప‌వ‌న్ క‌ళ్యాణ్ - పేర్ని నాని

సినీ పరిశ్రను ఏవిధంగా ఇబ్బంది పెట్టామో పవన్‌ చెప్పాలని మంత్రి పేర్నినాని అన్నారు. ఓ సినిమా ఆడియో ఫంక్ష‌న్‌లో సినిమా టికెట్ల విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ వాఖ్య‌ల‌పై ఆయ‌న మాట్లాడారు. ఆయ‌న‌తో పాటు ప‌లువురు మంత్రులు ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్య‌ల‌పై స్పందించారు.

  • Share this:
    సినీ పరిశ్రను ఏవిధంగా ఇబ్బంది పెట్టామో ప‌వ‌న్ క‌ళ్యాణ్  చెప్పాలని మంత్రి పేర్నినాని అన్నారు.  ఓ సినిమా ఆడియో ఫంక్ష‌న్‌లో సినిమా టికెట్ల విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ వాఖ్య‌ల‌పై ఆయ‌న మాట్లాడారు. పవన్‌ కల్యాణ్‌ పెద్ద సుత్తి కేసు.. రెండు చోట్లా ఓడిపోయినవాడు సన్నాసి కాదా? నేను సన్నాసి అయితే పవన్‌ సన్నాసిన్నర' అంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా సినిమా టికెట్లు అమ్ముకున్నారు. అప్పుడు ప్రశ్నించలేని పవన్‌ మా ఎన్నికల్లో ఓట్ల కోసమే ఇప్పుడు తిప్పలు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఎందుకు భయం? ట్యాక్స్‌ల విషయంలో కేంద్ర పెద్దలను ప్రశ్నించే దమ్ము ఉందా? అని ప్ర‌శ్నించారు. సాయితేజ్‌ ప్రమాదంపై పోలీసులు చెప్పిందే మీడియా చెప్పింది. తెలంగాణ పోలీసులను ప్రశ్నించే ధైర్యం పవన్‌కు లేదా? కేసీఆర్‌ను తిట్టే ధైర్యం పవన్‌కు లేదా? వాళ్లను ప్రశ్నించలేడు కాబట్టే.. ఇక్కడ సొల్లు కబుర్లు చెప్తాడు. అని అన్నారు.

    ఆయ‌న గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌
    పవన్ గురించి ఆలోచించాల్సిన అవసరం తమకు లేదని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటం వేస్ట్. రాష్ట్ర ప్రభుత్వం, సినిమా పరిశ్రమ మధ్య దూరం పెంచడానికే పవన్ తప్పుడు వ్యాఖ్యలు చేశారు. బ్లాక్ టికెట్లని అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం తప్పా? అని ప్రశ్నించారు. టికెట్ల విక్రయాలకు ఆన్‌లైన్ విధానాన్ని తీసుకువస్తే నీకు నష్టమేంటి? అని నిలదీశారు. శనివారం ఓ సినిమా ఆడియో ఫంక్ష‌న్‌ పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ స్పందించారు.

    Trains cancelled: "గులాబ్" ప్ర‌భావం పలు రైళ్లు రద్దు.. దారి మ‌ళ్లింపు వివ‌రాలు ఇవే


    కొంద‌రు సినీ పెద్ద‌లు సినిమా థియేటర్లు, టికెట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టారని చెప్పారు. సినీ‌పెద్దలతో సంబంధిత మంత్రి చర్చలు చేస్తున్నారని తెలిపారు.

    సీఎంను తిట్ట‌డం ఫ్యాష‌న్ అయిపోయింది : మంత్రి అనిల్‌ కుమార్‌యాదవ్‌
    పవన్ కల్యాణ్ నటించినా, మరే ఇతర నటుడు నటించినా కష్టం అనేది ఒకటే అని మంత్రి అనిల్‌ కుమార్‌యాదవ్‌ అన్నారు. ఓ సినిమా ఆడియో ఫంక్ష‌న్‌లో సినిమా టికెట్ అంశంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లపై మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ మాట్లాడారు. ఆన్‌లైన్‌ పోర్టల్‌లో టికెట్ అమ్మ‌డం అంటే ఎందుకంత భయమని ప్ర‌శ్నించారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో పవన్ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. సీఎం జగన్‌ను తిట్టడం పవన్ కల్యాణ్‌కు ఫ్యాషన్ అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఉనికి కోసమే పవన్‌ తాపత్రయ పడుతున్నాడని మండిపడ్డారు. తన ఒక్కడి కోసం చిత్రసీమను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పవన్ కల్యాణ్ మాట్లాడడం సరికాదని అన్నారు. ఇది పవన్ కల్యాణ్ క్రియేషన్ అని, చిత్రపరిశ్రమను ఇబ్బంది పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.

    ప్ర‌జ‌ల‌పై భారం వేస్తే ఊరుకోవాలా : మంత్రి బొత్స సత్యనారాయణ
    సినిమా టికెట్ల ధరలను ఇష్టానుసారంగా పెంచి, ప్రజలపై భారం వేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? అని మంత్రి బొత్స సత్యనారాయణ పవన్‌ కల్యాణ్‌పై మండిపడ్డారు. ఆయన ప‌వ‌న్ క‌ల్యాణ్ వాఖ్య‌ల‌పై మీడియాతో సినిమా టికెట్ల విషయంలో నియంత్రణ లేకుండా పోతోందని అన్నారు. సినిమ టికెట్ల ఆన్‌లైన్ అమ్మకాల విధానాన్ని సినిమా డిస్ట్రిబ్యూటర్లే అడిగారని తెలిపారు. వాళ్లకు లేని బాధ పవన్ కల్యాణ్‌కి ఎందుకు అని ప్రశ్నించారు. నోరు ఉందని పవన్ ఇష్టానుసారంగా మాట్లాడతారా? అని మండిపడ్డారు.
    Published by:Sharath Chandra
    First published: