Home /News /andhra-pradesh /

PEOPLE OF NADIKUDI VILLAGE IN GUNTUR DISTRICT FACING HEALTH PROBLEMS NS

స్పృహతప్పి పడిపోతున్న ప్రజలు.. ఏపీలోని ఆ గ్రామంలో కలకలం.. కారణం అదేనా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏలూరు ఘటన(Eluru Mystery Disease) మరవక ముందే గుంటూరు జిల్లాలో ఇలాంటి మరో ఘటన చోటు చేసుకోవడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. పలువురు స్పృహతప్పి పడిపోతుండడంతో స్థానికులు భయపడుతున్నారు.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతు చిక్కని వ్యాధి కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి ఏంటి? రావడానికి గల కారణాలు ఏంటి? అన్న విషయాలు ఇంక తేలనే లేదు. ఈ క్రమంలో గుంటూరులో ఇలాంటి ఘటనే మరోటి చోటు చేసుకోవడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. పలువురు స్పృహతప్పి పడిపోతుండడంతో స్థానికులు భయపడుతున్నారు. వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడికి చెందిన పల్లపు రామకృష్ణ(26) అనే వ్యక్తి ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో ఆయనను స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

    ఆరోగ్య పరిస్థితి మెరుగుకాపోవడంతో మంచి చికిత్స కోసం గుంటూరులోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఇలానే ఇటీవల మరో ఇద్దరు స్పృహ తప్పి పడిపోయారని స్థానికులు చెబుతున్నారు. అయితే సమీపంలోని పరీశ్రమల నుంచి వ్యర్థాలు వెలువడుతున్నాయని, ఈ కారణంగానే ఇలాంటి అనారోగ్యాలకు గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

    ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మిస్టరీ వ్యాధిపై పలు కారణాలు ప్రచారంలో ఉన్నాయి. విజయవాడ నుంచి ఢిల్లీ వరకు వివిధ సంస్థలకు చెందిన స్పెషల్ టీమ్స్ ఏలూరులోని త్రాగునీరు, పాలు, ఆహారం, కూరగాయలు వంటివాటి నుంచి శాంపిల్స్ తీసుకొని పరీక్షలు జరుపుతున్నారు. అయినా ఇంతవరకు వింత వ్యాధికి కారణమేంటనేదానిపై క్లారిటీ రాలేదు. పూర్తి స్పష్టత వస్తే తప్ప నివారణ చర్యలు చేట్టడం ప్రభుత్వానికి సాధ్యంకాదు. నీటి రసాయనాల మోతాదు ఎక్కువగా ఉండటంతో ఈ సమస్య తలెత్తినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. నీరు ఈస్థాయిలో కలుషితం కావడానికి కారణం ఆక్వాసాగు అనే వాదన కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఆదాయమిస్తున్న ఆక్వా సాగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా సాగు బాగా విస్తరించింది. గోదావరి డెల్టాలో వేలాది ఎకరాల్లో పంటలసాగు కాలువల ద్వారానే సాగుతోంది. డెల్టా ప్రధాన కాలువల చెంతనే ఆక్వా చెరువులు పట్టుకు వచ్చాయి. రెండు జిల్లాల్లో తూర్పు, పశ్చిమ డెల్టాలు, వాటి బ్రాంచ్ కాలువలు, పంటకాలువలన్నీ కలిపి 3వేల కిలోమీటర్ల మేర ఉన్నాయి. చేపలు,రొయ్యల పపెంపకంలో వాడే ఎరువులు, ఇతర మందుల అవశేషాలు, సాధారణ పంటల సాగులో వాడే రసాయనాలన్నీ నేరుగా పంటకాలువల్లో కలిసిపోతున్నాయి. అదే నీటిని శుద్ధి చేసి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని ప్రజలకు తాగునీరుగా సరఫరా చేస్తున్నారు. కావున ఏలూరులో పరీక్షించిన తాగునీటి నమూనాల్లో పరుగు మందుల అవశేషాలున్నట్లు నిపుణులు చెప్తున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Eluru, Guntur

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు