హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

టీడీపీ, వైసీపీ... రెండు పార్టీలకూ 100కు పైనే... నకిలీ సర్వేలపై ప్రజల ఆగ్రహం...

టీడీపీ, వైసీపీ... రెండు పార్టీలకూ 100కు పైనే... నకిలీ సర్వేలపై ప్రజల ఆగ్రహం...

AP Assembly Election 2019 : అన్నీ పనికిమాలిన సర్వేలే అంటున్నారు ప్రజలు. దేన్నీ నమ్మే పరిస్థితి లేకపోవడమే అసలు కారణం.

AP Assembly Election 2019 : అన్నీ పనికిమాలిన సర్వేలే అంటున్నారు ప్రజలు. దేన్నీ నమ్మే పరిస్థితి లేకపోవడమే అసలు కారణం.

AP Assembly Election 2019 : అన్నీ పనికిమాలిన సర్వేలే అంటున్నారు ప్రజలు. దేన్నీ నమ్మే పరిస్థితి లేకపోవడమే అసలు కారణం.

ఏపీలో ఎన్నికలకూ, ఫలితాలకూ మధ్య 42 రోజులు గ్యాప్ ఉండటంతో అడ్డమైన సర్వేలన్నీ తెరపైకి వచ్చాయి. సోషల్ మీడియాలో వస్తున్న సర్వేలకు లెక్కే లేదు. మరో మూడు రోజుల్లో అంటే 19వ తేదీ సాయంత్రం 5 గంటల 1 సెకండ్ అయితే చాలు... ఎగ్జిట్ పోల్స్ దుమ్మురేపుతాయి. అంతవరకూ మనం ఆగగలిగితే చాలు... కొంతవరకైనా మనం నమ్మగలిగే ఫలితాలు వస్తాయి. ఇక మే 23న ఎలాగూ అసలు చిట్టా బయటపడుతుంది. ఆ ఫలితాల్ని అందరం ఆమోదించుతాం కూడా. ఈలోపు ఇంటర్నెట్‌లో కనిపిస్తున్న సర్వేలు... ప్రతీ పార్టీకీ 100కు పైగా సీట్లు ఇస్తూ... మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి.

100కు పైగా ఎలా సాధ్యం : సపోజ్ ఒక పార్టీకి 100 పైగా సీట్లు వస్తాయని ఓ సర్వే చెప్పిందనుకుందాం. ఆ సర్వే ఎంత చెత్తదైనా... ఎంతో కొంతైనా అందులో వాస్తవం ఉంటుంది. అదే సమయంలో మరో సర్వే కూడా మరో పార్టీకి 100కు పైగా స్థానాలు వస్తుందని చెబితే... మనం ఏ సర్వేను నమ్మాలి. రెండు సర్వేల్లోనూ ఎంతో కొంత నిజం ఉందని అనుకుంటే, రెండూ పూర్తి విరుద్ధమైన ఫలితాల్ని ఎలా ఇస్తాయి. దీనర్థం ఏంటంటే... ఈ సర్వేలన్నీ ఏకపక్షంగా, ప్రత్యేక ఆసక్తితో తయారుచేస్తున్నవే తప్పితే... నిజంగా ప్రజల నాడిని తెలుసుకొని చేస్తున్నవి కాదని అంటున్నారు చాలామంది నెటిజన్లు. చివరకు ఈ సర్వేలు ఎంత దారుణంగా ఉంటున్నాయంటే... జనసేన పార్టీకి కూడా వందకు పైగా స్థానాలు వస్తున్నాయని చెబుతున్నాయి కొన్ని సర్వేలు. అందుకే వీటిని నమ్మాలంటేనే చిరాకొస్తోంది ప్రజలకు.

ఒకటే వైరల్ : ప్రజల్లో ఆసక్తిని క్యాష్ చేసుకుంటూ, ఇష్టమొచ్చిన సర్వేలను క్రియేట్ చేస్తూ... వాటిని షేర్ చేస్తూ, వైరల్ అయ్యేలా చేసుకుంటున్నారు కొందరు. అవి ఒట్టి నకిలీ సర్వేలని తెలియక చాలా మంది వాటిని నమ్మి నిజమేనేమో అనుకుంటున్నారు. వాస్తవానికి ఏపీ ఎన్నికల ఫలితాల్ని ఊహించడం చాలా కష్టం. ఎందుకంటే ఏపీలో పార్టీలు, అభ్యర్థులకు తోడు కులాలు, మతాలు, సామాజిక పరమైన అంశాలు అన్నీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి. వీటన్నింటినీ లెక్కలోకి తీసుకొని అంచనాలు వెయ్యడం కష్టమైన పని. కానీ చాలా సర్వే సంస్థలు... ఏదో కొద్ది మందిని పరోక్షంగా నాలుగు ప్రశ్నలేసి... తద్వారా వచ్చిన ఫలితమే... అసలైన ఫలితమని తేల్చేసి... ఇంటర్నెట్‌లో హల్ చల్ చేసుకుంటున్నాయి. అందుకే ఈ సర్వేలపై ప్రజలకు నమ్మకం తగ్గిపోయింది.


ఇవి కూడా చదవండి :

రామోజీరావుతో చంద్రబాబు భేటీ... ఏం చర్చించారంటే...

అండమాన్‌కి వస్తున్న నైరుతీ రుతుపవనాలు... తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఆలస్యమే...

First published:

Tags: Andhra Pradesh Assembly Election 2019, Chandrababu Naidu, Janasena, Pawan kalyan, TDP, Ycp

ఉత్తమ కథలు