లాక్‌డౌన్ దిశగా హైదరాబాద్‌.. ఏపీకి క్యూ కట్టిన జనం.. సరిహద్దుల్లో ట్రాఫిక్ జామ్

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది.

news18-telugu
Updated: July 1, 2020, 6:25 AM IST
లాక్‌డౌన్ దిశగా హైదరాబాద్‌.. ఏపీకి క్యూ కట్టిన జనం.. సరిహద్దుల్లో ట్రాఫిక్ జామ్
హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధిస్తారనే ఊహాగానాల నేపథ్యంతో మళ్లీ సొంత రాష్ట్రానికి క్యూ కట్టిన ఏపీ వాసులు
  • Share this:
గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కట్టడి కోసం మరోసారి లాక్‌డౌన్ పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి దాదాపుగా ఓ నిర్ణయం కూడా తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. లాక్‌డౌన్ నిర్ణయానికి తగ్గట్టుగానే ముందుగానే ఎంసెట్ సహా పలు ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు హైకోర్టుకు తెలిపింది తెలంగాణ సర్కార్. లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం పరోక్షంగా సంకేతాలు ఇవ్వడంతో.. గ్రేటర్‌లోని ఆంధ్ర ప్రాంత ప్రజలు సొంత రాష్ట్రానికి పయనమవుతున్నారు. దీంతో, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది.

మరోవైపు రాష్ట్రంలోకి ప్రవేశించడానికి సాయంత్రం 7 గంటల వరకే అనుమతి ఉండటంతో... బోర్డర్ వద్ద అధికారులు వాహనాలను నిలిపి వేస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో రెండు మూడు రోజుల్లో లాక్‌డౌన్ ఉండే అవకాశం ఉండటంతో... మరికొందరు ఆంధ్రా ప్రాంత ప్రజలు సొంత రాష్ట్రానికి తరలివెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

First published: July 1, 2020, 6:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading