Home /News /andhra-pradesh /

Unique Tradition: వీళ్ల వేషాలు చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం..! ఈ విచిత్ర సాంప్రదాయం ఎక్కడంటే..!

Unique Tradition: వీళ్ల వేషాలు చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం..! ఈ విచిత్ర సాంప్రదాయం ఎక్కడంటే..!

తూర్పుగోదావరి జిల్లాలో విచిత్ర వేషధారణలు

తూర్పుగోదావరి జిల్లాలో విచిత్ర వేషధారణలు

ఏవైనా పండుగలు వచ్చినా, జాతరలు వచ్చినా కొందరు కళాకారులు దేవుళ్ల వేషధారణలతో ఆకట్టుకుంటారు. రాముడు, కృష్ణుడు, అమ్మవారు, ఆంజనేయుడు ఇలా రకరకాల వేషధారణలు మనం తరచూ చూస్తూ ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ ప్రాంతంలో వేసే వేషాలను చూస్తే ఒళ్లు గగుడ్పొడుస్తుంది.

ఇంకా చదవండి ...
  P. Anand Mohan, Visakhapatnam, News18

  ఏవైనా పండుగలు వచ్చినా, జాతరలు వచ్చినా కొందరు కళాకారులు దేవుళ్ల వేషధారణలతో ఆకట్టుకుంటారు. రాముడు, కృష్ణుడు, అమ్మవారు, ఆంజనేయుడు ఇలా రకరకాల వేషధారణలు మనం తరచూ చూస్తూ ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ ప్రాంతంలో వేసే వేషాలను చూస్తే ఒళ్లు గగుడ్పొడుస్తుంది. కత్తులతో ఒకరిపై ఒకరు దాడిచేసి చేయడం, బల్లెంను గుండెల్లో దించడం, తలపై నుండి కిందకు గోడ్డలి నరకడం, ఒక పెద్ద గొడ్డలితో భుజంపై ఒక వేటు వేయ్యటం.., గడ్డపారతో డొక్కలో ఒక పోటు పోడవటం.. రంపంతో పోట్టను బరాబరామని కోయటం. ఇవన్నీ తలచుకుంటేనే భయమేస్తుంది కదూ..? వాటిని చూస్తే భయంతో పరుగులు పెట్టడం ఖాయం.

  మన కాలికి ముల్లు గుచ్చుకుంటేనే బాబోయ్ అంటూ బరించలేము.. అటువంటిది ఈ వేషగాళ్లు పీక లోకి కత్తి దించేస్తారు. మరొకరికి పొట్టలోనూ.,. మరోకరికి నెత్తిమీద గొడ్డలి దించేయటం.. జబ్బను గొడ్డలితో నరికేయంటం.. రంపంతో మనిషిని కోసేయటం ఇవన్ని చూస్తూంటే రక్తచరిత్ర సినిమాను తలపించేలా ఉంటే అందరూ విచిత్రంగా ఆనందంతో ఎంజాయ్ చేస్తూ చూస్తూన్నారు. అదే తరతరాలనుండి వస్తూన్న వింత ఆచారం ఇది. తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) యు.కొత్తపల్లి మండలం మూలపేటలో ఈ విచిత్ర వింత ఆచార వేషధారణలు జరిగాయి. పట్టుశాలీ సంఘం ఆధ్వర్యంలో గౌరీ దేవి మహోత్సవ సంబరాలు ప్రతియేటా నిర్వహిస్తారు.

  ఇది చదవండి: అక్కడి మటన్ ఎందుకంత రుచి..! కారణం తెలిస్తే వారెవ్వా అంటారు..!  కార్తీకమాసంలో దీపావళి ముందునుండి పంటపొలంలో వరి దుబ్బులు తెచ్చి గౌరి దేవిని ఆడపడుచుగా కొలిచి ప్రతిష్టించి, నందిస్వరుడుని తీసుకువచ్చి ఎనిమిది సంవత్సరాలలోపు వయసున్న బాలికతో ఉపవాస పూజలు చేయిస్తారు. నెలరోజుల పూజలు తరువాత పౌర్ణమి మరనాడు గౌరి దేవిని ఊరేగించి నిమజ్జనం చేస్తారు. కానీ ఈ విచిత్రమైనా కత్తిపోట్లు వేషాలు మాత్రం మూడు, ఐదు సంవత్సరాలకోక సారి మాత్రమే ఏర్పాటు చేస్తారు. ఇలాంటి వేషాలు వేయ్యటం తరతరాలుగా వస్తున్న ఆచారంగా స్థానికులు చెబుతారు.

  ఇది చదవండి: ఇక్కడున్నది చీరలు,నగలు అనుకుంటే మీ పొరబాటే..! సరిగ్గాచూస్తే షాక్ అవుతారు..


  ఇలా చేస్తే ఊరు అంతా సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉంటారని గ్రామస్తుల నమ్మకం. ఈ కార్యక్రమం జరపకపోతే అరిష్టం జరుగుతుందని గ్రామస్తుల విశ్వసిస్తారు. ఈవింత ఆచారం వేషధారణలు చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు తరలివస్తుంటారు. ఈసారి నిర్వహించిన కత్తిపోట్లు వ్యాసాలు కరోనా కారణంగా ఏడు సంవత్సరాల తర్వాత నిర్వహించడంతో ఇవి చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. పూర్వం ఇలాంటి ఆచారాలు విధిగా పాటించేవారు. కాలక్రమేణ ఉత్సవాలు, జతరలు కనుమరుగైపోతున్నాయి. ఈ గ్రామంలో మాత్రం ఎన్ని సమస్యలు వచ్చినా గౌరీదేవి ఉత్సవాలు మాత్రం జరుగుతాయి.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, East Godavari Dist

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు