ఏపీ పోలీసులపై రాళ్ల దాడి.. జగన్ ప్రెస్ మీట్ తర్వాత జనాగ్రహం...

గుంటూరు చిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్ పోస్టు వద్ద పోలీసుల మీద ప్రజలు రాళ్ల దాడి చేశారు.

news18-telugu
Updated: March 26, 2020, 8:59 PM IST
ఏపీ పోలీసులపై రాళ్ల దాడి.. జగన్ ప్రెస్ మీట్ తర్వాత జనాగ్రహం...
ఏపీ బోర్డర్‌లో పోలీసుల పహారా
  • Share this:
ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ బోర్డర్‌లో వివాదం మరింత ముదిరింది. నిన్న రాత్రి నుంచి బోర్డర్లో పడిగాపులు పడుతున్నా తమను ఏపీలోకి రానివ్వడం లేదంటూ ఆగ్రహించిన ప్రజలు ఏపీ పోలీసుల మీద రాళ్ల దాడి చేశారు. ఏపీలోకి వచ్చే వారు కచ్చితంగా 14 రోజులు క్వారంటైన్‌లో ఉంటామంటేనే తీసుకుంటామని సీఎం జగన్ అధికారికంగా ప్రెస్ మీట్‌లో చెప్పిన తర్వాత వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆగ్రహాన్ని పోలీసుల మీద చూపించారు. పోలీసుల మీద రాళ్లతో దాడి చేశారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్ పోస్టు వద్ద ఈ పరిస్థితి ఏర్పడింది.

ఏపీలోకి తమను అనుమతించాలంటూ తెలంగాణ పోలీసులు ఇచ్చిన NOCలు తీసుకుని వేలాది మంది ప్రజలు ఏపీకి బయలుదేరారు. అయితే, అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద ఏపీ పోలీసులు రాష్ట్రంలోకి రానివ్వలేమని స్పష్టం చేశారు. నిన్న రాత్రి నుంచి ప్రజలు చెక్ పోస్టుల వద్ద రోడ్డు మీద పడిగాపులు కాస్తున్నారు. ఈ సందర్భంగా దాచేపల్లి మండలం పొందుగల చెక్ పోస్ట్ వద్ద పోలీసులుతో వాగ్వదం తోపులాట జరిగింది. వారిని రాష్ట్రంలోకి రానివ్వలేమని, ఒకవేళ ఏపీలోకి రావాలంటే కచ్చితంగా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందేని సీఎం జగన్ స్పష్టం చేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నిన్నటి నుంచి వేచి ఉన్న జనం ఒక్కసారిగా రెచ్చిపోయి ఆంధ్ర పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలు కాగా, కొందరికి తలలు పగిలాయి. దీంతో రెచ్చి పోయిన పోలీసులు రాళ్ల దాడికి పాల్పడిన జనంపై లాఠీ ఛార్జ్ చేశారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎస్పీ విజయారావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు