బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిసారి స్వామివారికి పెద్దశేష వాహనసేవ
Tirumala Srivari Brahmostavams 2020 Pedda Vahana Seva: శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా మొదలయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి మొదటి వాహన సేవగా శనివారం రాత్రి పెద్దశేష వాహనసేవను వైభవంగా నిర్వహించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా మొదలయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కలియుగ ప్రత్యక్ష దైవానికి మొదటి వాహన సేవగా శనివారం రాత్రి పెద్దశేష వాహనసేవను వైభవంగా నిర్వహించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడం తెలిసిందే. శనివారం సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముక్కోటి దేవతలు, భక్తకోటిని శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ మీన లగ్నంలో అర్చకులు ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అనంతరం రాత్రి మలయప్ప స్వామివారికి పెద్దశేష వాహన సేవను నిర్వహించారు. భూదేవి, శ్రీదేవి సమేత మలయప్ప స్వామిని అలయ మండపంలో కొలువుదీర్చి వాహనసేవను నిర్వహించారు.
మలయప్ప స్వామికి పెద్దశేష వాహనసేవ...
పెద్ద శేష వాహనంపై కొలువుదీరిన దేవదేవుడు మానవుల్లోని కల్మశాన్ని హరిస్తాడని ఈ సేవ అంతరార్థం. కరోనా నేపథ్యంలో ఏకాంతంగా వాహనసేవలను నిర్వహిస్తారు.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.