Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ కాంగ్రెస్‌లోకి వస్తే.. ఆ పదవి ఇస్తామన్న సీనియర్ నేత

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(ఫైల్ పొటో)

Pawan Kalyan: రాష్ట్రంలో 3 శాతం ఉన్న సామాజికవర్గం వారు కాంగ్రెస్‌ను నాశనం చేశారని దుయ్యబట్టారు. బీసీలకు పీసీసీ చీఫ్‌ ఇవ్వాలన్నందుకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని వీహెచ్ వ్యాఖ్యానించారు.

  • Share this:
    జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆఫర్ ఇచ్చారు. ఆయన కాంగ్రెస్‌లోకి వస్తే పీసీసీ చీఫ్‌ పదవి ఇప్పిస్తానని ప్రకటించారు. దొండపాడులో వంగవీటి రంగా విగ్రహాన్ని వి. హనుమంతరావు ఆవిష్కరించారు. వంగవీటి రంగా రానున్న రోజుల్లో సీఎం అవుతాడనే హత్య చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 3 శాతం ఉన్న సామాజికవర్గం వారు కాంగ్రెస్‌ను నాశనం చేశారని దుయ్యబట్టారు. బీసీలకు పీసీసీ చీఫ్‌ ఇవ్వాలన్నందుకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని వీహెచ్ వ్యాఖ్యానించారు. తాను బెదిరింపులకు భయపడనని స్పష్టం చేశారు.

    పార్టీ కోసం ప్రాణం పోయినా వెనక్కి తగ్గనని అన్నారు. దళితుడిని సీఎం చేస్తానని సీఎం కేసీఆర్‌ మోసం చేశారని వీహెచ్‌ ఆరోపించారు. ఏపీలో 27 శాతం ఉన్న కాపులు రాజ్యాధికారం సాధించాలని వి. హనుమంతరావు ఆకాంక్షించారు. వంగవీటి రంగా తర్వాత పవన్‌కళ్యాన్‌కు ఆంధ్రప్రదేశ్‌లో వేవ్ ఉందని హనుమంతరావు తెలిపారు.

    ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీలో రాజకీయంంగా బీజేపీతో కలిసి పని చేస్తున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయంగానూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిిసి ఏపీలో రాజకీయశక్తిగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కాపు సామాజికవర్గానికి చెందిన పవన్ కళ్యాణ్‌ ద్వారా ఆ వర్గాన్ని ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. జనసేనతో కలిసి రాజకీయ పోరాటాలు చేసేందుకు సిద్ధమవుతోంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగుతారని ఆ పార్టీ ప్రకటించింది. అయితే జనసేనతో చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published: