Home /News /andhra-pradesh /

PAWAN KALYAN WEAVERS PROMOTION CHALLENGE TO TDP CHIEF CHANDRABABU NAIDU SB

Pawan Kalyan: కేటీఆర్ సవాల్.. చంద్రబాబుకు పవన్ కళ్యాన్ ఛాలెంజ్..!

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

కేటీఆర్ సవాల్ స్వీకరిస్తూ.. పవన్ కళ్యాణ్ ట్వీట్‌ చేశారు. చంద్రబాబు నాయుడికి పవన్ ఈ మేరకు ఛాలెంజ్ విసిరారు. ప్రస్తుతం పవన్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం.. రాజకీయ నేతల మధ్య చేనేత ఛాలెంజ్ నడుస్తోంది. జాతీయ చేనేత దినోత్సవం (National Handloom day) సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చేనేత కళాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. అదే సందర్భంలో చేనేత ఉత్పత్తుల ప్రమోషన్ కోసం ఆయన #MyHandloomMyPride పేరుతో ఛాలెంజ్ విసిరారు. చేనేతలతో దిగిన ఫొటోలను.. ట్వీట్ చేయాలని కోరారు. ఈ ఛాలెంజ్‌ను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , పారిశ్రామిక వేత్త ఆనంద మహేంద్ర, క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు విసిరారు. కేటీఆర్ చేనేత ఛాలెంజ్‌ను పవన్ కళ్యాణ్ స్వీకరించారు

    చేనేత దినోత్సవంగా సందర్భంగా కేటీఆర్ సవాల్ స్వీకరించిన పవన్ చేనేత వస్త్రాలు ధరించి ఫోటోలను షేర్ చేశారు. అంతే కాదు మరో ముగ్గురికి ఆయన సవాల్ విసిరారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు... మాజీ మంత్రి బాలినేని వాసు, బీజేపీ సీనియర్ నేత ఎంపీ లక్ష్మణ్‌కు పవర్ స్టార్ సవాల్ విసిరారు.


    చేనేతల మీద తనకున్న ప్రేమాభిమానాలను చాటుకుంటూ వారితో దిగిన ఫొటోలను పవన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు చేనేత వస్త్రాలను ధరించడం కాదు.. చేనేతలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పోస్టు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ తన ఛాలెంజ్ స్వీకరించి చేనేత వస్త్రాలు ధరించడంతో ... కేటీఆర్ థాంక్స్ పవన్ కళ్యాన్ అన్న అంటూ.. ధన్యవాదాలు తెలుపుతూ మరో ట్వీట్ చేశారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Chandrababu Naidu, KTR, Power star pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు