జనసైనికులకు పవన్ కళ్యాణ్ పిలుపు...

Pawan Kalyan : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు జోరుగా ఉన్నాయి. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె దుమారం కొనసాగుతుంటే... ఏపీలో ఇసుక వివాదం దుమ్ము రేపుతోంది. పవన్ కళ్యాణ్ లాంటి వారు... దీనిపై లోతుగా పోరాడుతున్నారా?

news18-telugu
Updated: November 18, 2019, 10:33 AM IST
జనసైనికులకు పవన్ కళ్యాణ్ పిలుపు...
పవన్ కళ్యాణ్ (File)
  • Share this:
Pawan Kalyan : ఏపీలో ఇసుక కొరత అంశం అటు రాజకీయంగా ఇటు ఆర్థికపరంగా దుమారం రేపుతోంది. దీనిపై ఇప్పటికే ఆందోళనలు, లాంగ్ మార్చ్ చేసిన జనసేన... ఎట్టి పరిస్థితుల్లో ఇసుక సమస్యను ప్రభుత్వం పరిష్కరించేలా గట్టి చర్యలు చేపట్టాలని డిసైడైంది. ఈ విషయంపై జన సైనికులంతా... అక్రమ ఇసుక తవ్వకాలపై ఓ కన్నేసి ఉంచాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా కోరారు. ఇసుక అవినీతిపై పోరాటం ఇప్పుడే మొదలైందన్న ఆయన... అప్రమత్తంగా ఉండాలని జన సైనికులకు పిలుపిచ్చారు. ఇదే విషయమై మీడియా, వ్యక్తులు, రాజకీయ వేత్తలకు మనస్ఫూర్తిగా థాంక్స్ చెబుతున్నానన్న పవన్ కళ్యాణ్... అందరూ కలిసి... వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి... శాండ్ పాలసీలో జరిగిన తప్పుల్ని చక్కగా వివరించారని అభిప్రాయపడ్డారు. ఇసుక కొరత వల్ల ఏపీలో ఇప్పటికే 50 మంది కార్మికులు చనిపోయారన్న పవన్ కళ్యాణ్... 35 లక్షల మంది నిర్మాణ కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు.


Pics : సోలో ట్రావెలర్... ప్రపంచాన్ని చుట్టేస్తున్న యువతిఇవి కూడా చదవండి :

షానా చౌహాన్... సక్సెస్‌కి చిరునామా...

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాబ్డే ప్రమాణస్వీకారం...

ఒంటరి యువతిపై రేప్... చికెన్ బిర్యానీ ఇచ్చి...

అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్? నెక్ట్స్ ఏమవుతుంది?

స్కూళ్లకు సెలవులు ఇవ్వండి... ప్రభుత్వానికి పేరెంట్స్ విజ్ఞప్తి

 
First published: November 18, 2019, 10:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading