జగన్ 6 నెలల పాలనపై పవన్ కళ్యాణ్ 6 అస్త్రాలు...

Andhra Pradesh : ఓవైపు ఇసుక తుఫాన్ కొనసాగుతుండగానే... మరోవైపు తెలుగు భాషపై పోరాడుతున్న జనసేన... అదే తెలుగులో... వైసీపీ ఆరు నెలల పాలనపై సెటైరికల్‌గా స్పందించింది.

news18-telugu
Updated: November 23, 2019, 7:09 AM IST
జగన్ 6 నెలల పాలనపై పవన్ కళ్యాణ్ 6 అస్త్రాలు...
జగన్ 6 నెలల పాలనపై పవన్ కళ్యాణ్ 6 అస్త్రాలు...
  • Share this:
Andhra Pradesh : ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలలు కావడంతో... సీఎం జగన్‌పై సెటైరికల్‌గా విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ ఆరు నెలల్లో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్న ఆయన... చేసిందల్లా... విధ్వంసం, దుందుడుకుతనం, కక్షసాధింపుతనం, మానసికవేదన, అనిశ్చితి, విచ్ఛిన్నం మాత్రమే అంటూ తెలుగులో ఆరు ట్వీట్లు చేశారు. ఆరు అంశాలకూ వివరణ ఇస్తూ... ఆరు ట్వీట్లు చేశారు. ఒక్కో ట్వీట్‌లో ఒక్కో పదానికి వివరణ ఇచ్చారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఇంగ్లీష్ భాషను స్కూళ్లలో బోధించాలని డిసైడవ్వడంతో... అప్పటి నుంచీ తెలుగు భాషను బతికించాలనే పిలుపు ఇచ్చిన పవన్ కళ్యాణ్... తెలుగులోనే ట్వీట్లు చేస్తూ... వైసీపీ తీరును వ్యతిరేకిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ పెట్టిన ట్వీట్లు సాధారణంగానే వైరల్ అవుతున్నాయి. ఆయనకు ఉన్న ఫ్యాన్స్, జనసేన సైనికులు అందరూ ఆ ట్వీట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.












పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కేవలం ఒక్క చోట మాత్రమే గెలిచిందనీ, అసలా పార్టీని లెక్కలోకి తీసుకునే అవసరమే లేదంటున్న వైసీపీ నేతలు... పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు, పెట్టే ట్వీట్లపై మాత్రం స్పందిస్తూనే ఉన్నారు. కౌంటర్లు వేస్తూనే ఉన్నారు. మరి తాజా ట్వీట్లపై ఎలా స్పందిస్తారన్నది నెక్ట్స్ సీన్.


Pics : ఆగ్రా అందాల బ్యూటీ ఆషీ సింగ్ క్యూట్ స్టిల్స్



ఇవి కూడా చదవండి :

గుంటూరులో హైటెక్ వ్యభిచారం... 70 జంటలు అరెస్ట్

నిత్యానంద ఆచూకీ లభ్యం... ఆ దేశంలో...

త్వరలో కొత్త బార్లు... ఇవీ రూల్స్

Health : గుమ్మడికాయ గింజలతో 7 ఆరోగ్య ప్రయోజనాలు

Health Tips : బంగాళాదుంపల్ని ఇలా వండితే మేలు

Published by: Krishna Kumar N
First published: November 23, 2019, 7:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading