నేడు పవన్ కళ్యాణ్... ఛలో అమరావతి

Andhra Pradesh : వైసీపీకి 100 రోజులు టైమ్ ఇస్తానన్న పవన్ కళ్యాణ్... ఇక ఇప్పుడు క్షేత్ర పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ముందుగా అమరావతి నుంచే పోరుబాట మొదలుపెట్టబోతున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 14, 2019, 5:14 AM IST
నేడు పవన్ కళ్యాణ్... ఛలో అమరావతి
పవన్ కళ్యాణ్ (File)
  • Share this:
Amaravati : ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ పరిపాలన ఎలా ఉన్నా... రాజధాని అమరావతి విషయంలో సర్కార్... స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడంతో... ప్రజల్లో ఒక రకమైన సందిగ్ధం నెలకొంది. అసలు రాజధానిగా అమరావతి ఉంటుందా, ఉండదా అన్న ప్రశ్నకు కచ్చితమైన సమాధానం దొరకట్లేదు. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్... ఇప్పటివరకూ కచ్చితమైన ప్రకటన చెయ్యకపోవడంతో... ప్రజల్లో సందేహాలు అలాగే ఉన్నాయి. అదే సమయంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు... అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్... రాజధాని విషయంలో ప్రభుత్వ తీరును తప్పుపడుతూ... క్షేత్ర పర్యటనకు సిద్ధమయ్యారు. నేటి నుంచీ మూడు రోజుల పాటూ అమరావతిలో పర్యటించనున్నారు. ఇటీవలే ఆయన రెండ్రోజుల పాటూ అమరావతి పరిసరాల్లో తిరిగినా... అప్పటికి వైసీపీ 100 రోజులు పూర్తికాలేదు. ఇప్పుడు 100 రోజులు దాటడంతో... ఇక ప్రభుత్వంపై పోరులో భాగంగా... పవన్ కళ్యాణ్ పర్యటనలు సాగనున్నాయి.

తన పర్యటనలో భాగంగా... ముందుగా పవన్... నేడు వైసీపీ 100 రోజుల పాలనపై తన అభిప్రాయాన్ని చెప్పనున్నారు. ఆ తర్వాత మూడ్రోజులపాటూ అమరావతిలోనే ఉండనున్న పవన్... పార్టీ నేతలు, కార్యకర్తలతో సమీక్షలు జరుపుతారు. ఈ సమయంలో బెజవాడకు చెందిన వంగవీటి రాధా... జనసేనలో చేరతారని తెలిసింది. రాజధానిగా అమరావతే ఉండాలని కోరుతున్న పవన్ కళ్యాణ్... ఈ విషయంలో అవసరమైతే రైతుల తరపున, ప్రజల తరపున దీక్షకు దిగుతానని ప్రకటించే అవకాశాలున్నాయి.

మరోవైపు పవన్ కళ్యాణ్... నల్లమలలో యురేనియం తవ్వకాల నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ ప్రాంతంలో... యురేనియం కోసం తవ్వకాలు జరపాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా పోరాడుతున్నాయి. ఈ విషయంలో నల్లమల పరిరక్షణ కోసం జనసేన మద్దతుగా నిలుస్తుందని పవన్ ప్రకటించారు. అందువల్ల త్వరలో ఆయన ఈ దిశగా కూడా ఆందోళనలు చేసే అవకాశాలున్నాయి.
First published: September 14, 2019, 5:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading