స్టైరీన్ గ్యాస్ పీల్చిన బాధితులు భవిష్యత్తులో చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. బాధితులకు శాశ్వత ప్రాతిపదికన ఆరోగ్య కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
కరోనా వైరస్‌తో సహజీవనం చేసే పరిస్థితి తప్పదని సీఎం జగన్ చెప్పారని.. స్టైరీన్ విషవాయువుతోనూ సహజీవనం చేయాల్సిందేనా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకు ఘటన బాధితులను పరిహారం ఇచ్చారని, మరీ పరిష్కారం సంగతేంటని నిలదీశారు. వాస్తవానికి పారిశ్రామిక అభివృద్ధి ప్రధానమేనని, అదే సమయంలో ప్రజల ప్రాణాలు అంతకంటే ప్రధానమన్న సంగతి మర్చిపోవద్దని పవన్ కల్యాణ్ హితవు పలికారు. గ్యాస్ లీకు ఘటనకు కారణమైన యాజమాన్యంపై నమోదు చేసిన క్రిమినల్ కేసులను చూసి నిపుణులు సైతం నివ్వెరపోతున్నారని ఎద్దేవా చేశారు. స్టైరీన్ గ్యాస్ పీల్చిన బాధితులు భవిష్యత్తులో చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. బాధితులకు శాశ్వత ప్రాతిపదికన ఆరోగ్య కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పరిశ్రమల అభివృద్ధి పర్యావరణ హితంగా.. ప్రజాజీవన విధానం మెరుగుపడే విధంగా ఉండాలని, అలాంటి పరిశ్రమలకు మాత్రమే ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని పవన్ కల్యాణ్ సూచించారు.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.