జనం ఉల్లి కష్టాలు తీర్చేందుకు జగన్‌కు పవన్ కళ్యాణ్ సలహా...

ఉల్లి కష్టాల నుంచి ప్రజలను రక్షించేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చారు.

news18-telugu
Updated: December 9, 2019, 4:51 PM IST
జనం ఉల్లి కష్టాలు తీర్చేందుకు జగన్‌కు పవన్ కళ్యాణ్ సలహా...
పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్
  • Share this:
దేశవ్యాప్తంగా ఉల్లి కష్టాలు సామాన్యులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కేజీ ఉల్లి రూ.170 వరకు పలుకుతోంది. కొన్ని చోట్ల కొంచెం అటు ఇటుగా ధర పలుకుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేసి సబ్సిడీ మీద అందిస్తోంది. కేజీ ఉల్లిని రూ.25కే అందిస్తోంది. అయితే, ఒక్కొక్కరికి ఒక్కో కేజీ ఉల్లి మాత్రమే అందిస్తున్నారు. దీంతో రైతు బజార్ల వద్ద కిలోమీటర్ల మేర క్యూలో నిలబడి మరీ ప్రజలు ఉల్లిని కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉల్లిపాయల కోసం వెళ్లిన కృష్ణా జిల్లా గుడివాడలో ఓ వృద్ధుడు గుండెపోటుతో కన్నుమూశాడు.

అయితే, ఉల్లి కష్టాల నుంచి ప్రజలను రక్షించేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చారు. ప్రజలను క్యూలో నిలబెట్టే బదులు... జగన్ తీసుకొచ్చిన గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటికే కేజీ ఉల్లి సరఫరా చేయవచ్చు కదా అని సూచించారు. ‘మీరు ప్రజలని క్యూలలో నుంచోపెట్టి చంపేకంటే , మీరు నియమించిన గ్రామ వాలంటీర్లను ఉపయోగించి ,ప్రజలు ఇళ్ల దగ్గరికే కిలో 25 రూపాయలకే ఉల్లిపాయల సరఫరా ఎందుకు చేయట్లేదో, జగన్ రెడ్డి వివరణ ఇవ్వాలి’ అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>