అందువల్లే కురిచేడులో ఆ మరణాలు.. జగన్ సర్కార్‌పై పవన్ కళ్యాణ్ ఫైర్

కురిచేడులో చనిపోయినవారు పేద కుటుంబాలవారే ఉన్నారన్న పవన్ కళ్యాణ్... ఆ కుటుంబాలకు ప్రభుత్వం తగిన సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: July 31, 2020, 1:41 PM IST
అందువల్లే కురిచేడులో ఆ మరణాలు.. జగన్ సర్కార్‌పై పవన్ కళ్యాణ్ ఫైర్
పవన్ కళ్యాణ్ (Twitter/Photo)
  • Share this:
ప్రకాశం జిల్లా కురిచేడులో మద్యం బదులు శానిటైజర్ తాగి తొమ్మిది మంది మృత్యువాతపడ్డారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మద్యం నిషేధిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో ఊరూరా నాటు సారా ఏరులై పారుతున్నా నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఫలితంగా మద్యానికి బానిసలైనవాళ్లు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. మత్తు కోసం నాటు సారా, శానిటైజర్ కలుపుకొని తాగారని క్షేత్ర స్థాయి నుంచి సమాచారం అందుతోందని జనసేన వ్యాఖ్యానించింది. ఈ మరణాలపై సమగ్ర విచారణ చేపట్టాలి. కురిచేడులో చనిపోయినవారు పేద కుటుంబాలవారే ఉన్నారన్న పవన్ కళ్యాణ్... ఆ కుటుంబాలకు ప్రభుత్వం తగిన సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

నాటు సారాను అరికట్టడంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని... ఈ విషయంలో నిర్లిప్తతకు తోడు మద్యం దుకాణాలను తెరిచి ఉంచే సమయం మరో గంటసేపు పొడిగించడం చూస్తుంటే ప్రభుత్వానికి మద్య నిషేధంపై చిత్తశుద్ధి లేదని అర్థం అవుతోందని విమర్శించారు. నాటు సారా సరఫరా పెరుగుతున్నా, మద్యం దుకాణాల ముందు బారులు తీరి జనాలు ఉంటున్నా మద్య విమోచన కమిటీ స్పందించడం లేదని మండిపడ్డారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక డి-ఎడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అవి సమర్థంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: July 31, 2020, 1:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading