news18-telugu
Updated: March 2, 2019, 3:36 PM IST
పవన్ కల్యాణ్
లోక్‌సభ ఎన్నికలకు ముందు యుద్ధం వస్తుందనే విషయాన్ని రెండేళ్ల క్రితమే బీజేపీ తనకు చెప్పిందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించాయి. పాకిస్థాన్ పత్రికలు, వెబ్ సైట్లు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కథనాలను ప్రచురించాయి. దీంతో అసలు పవన్ కళ్యాణ్‌కు ఆ మాట చెప్పింది ఎవరు? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇదే విషయాన్ని బీజేపీ ఎంపీ జీవీఎస్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు యుద్దం వస్తుందని పవన్ కళ్యాణ్‌కు చెప్పిన ఆ బీజేపీ నేత ఎవరో చెప్పాలని జీవీఎల్ కోరారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిస్తే పవన్ కళ్యాణ్2కు ప్రజాదరణ ఉంటుందన్నారు.

పవన్ కళ్యాణ్
పాకిస్తాన్లో హీరోలు కావాలనే తాపత్రయంలో కొందరు మోదీపై నిందలు మోపుతున్నారని జీవీఎల్ అన్నారు. చంద్రబాబు, మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా ఈమధ్య వింతగా మాట్లాడుతున్నారని జీవీఎల్ ఎద్దేవా చేశారు. పీకే అంటే షార్ట్ కట్లో పాకిస్తాన్. అందుకే వారు హీరో అనుకుంటున్నారని జీవీఎల్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు ప్రభావం పనిచేసిందని జీవీఎల్ అనుమానం వ్యక్తం చేశారు. ఒకప్పుడు చంద్రబాబు, లోకేష్ మీద విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారిని ఏమీ అనడం లేదన్నారు. మోదీని తిట్టడానికి శివాజీ స్థాయి సరిపోవడం లేదని, పెద్ద హీరో పవన్‌తో చంద్రబాబు మాట్లాడించారేమో అని జీవీఎల్ అనుమానం వ్యక్తం చేశారు.
First published:
March 2, 2019, 2:49 PM IST