Pawan Kalyan: నిరుద్యోగుల కోసం రంగంలోకి దిగిన పవన్.. జాబ్ క్యాలండర్ పై ప్రత్యేక పోరాటం

జనసేన అధినేత పవన్ కల్యాణ్

ఏపీలో మళ్లీ రాజకీయంగా పవన్ యాక్టివ్ అవుతున్నారు. ఆ మద్య కాలంలో సినిమా షూటింగ్ లతో బిజీ అయిన ఆయన.. తరువాత కారోనా కారణంగా ఏపీ వైపు కన్నేత్తి చూడలేదు. ఇప్పుడు కరోనా క్రమంగా తగ్గుతుండడంతో ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా తొలి పోరాటానికి సిద్ధమ్యారు.

  • Share this:
    గత కొంత కాలంగా సినిమా షూటింగ్ లకే పరిమితమైన పవన్ కళ్యాణ్ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. ఇటీవల మంగళగిరిలో పర్యటనించిన ఆయన రాజధాని రైతులు, నిరుద్యోగులను కలిశారు. వారి సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా నిరుద్యోగుల కోసం నేరుగా రంగంలోకి దిగి పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు బాసటగా జనసేన పోరాటం చేస్తుందని స్వయంగా ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. 20వ తేదీన జిల్లాల్లో ఎంప్లాయ్మెంట్ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని, ఆ హామీని నమ్మిన యువత మోసపోయిందని పవన్‌ విమర్శించారు. ఏపీపీఎస్సీ ద్వారా 2.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆనాడు చెప్పారని పవన్‌ ఆరోపించారు. ఎన్నికలకు ముందు లక్షల్లో ఉద్యోగాలు .. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వేలల్లోనా ? ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలను జాబ్ క్యాలెండర్ లో చేర్చి భర్తీ చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

    జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడంతో వైసీపీ మాటలు నమ్మిన నిరుద్యోగ యువత ఇప్పుడు నిరుత్సాహ పడుతుందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే నిరుద్యోగుల పక్షాన జనసేన పోరాటం చేస్తుందన్న పవన్ కళ్యాణ్ యువత ఎన్నో కష్టనష్టాలకోర్చి గత రెండేళ్లుగా ఉద్యోగాల కోసం, అందుకు సంబంధించిన పోటీ పరీక్షలకోసం సన్నద్ధమవుతున్నారు అని పవన్ కళ్యాణ్.

    ఏపీలో ఉన్న అన్ని శాఖల్లో ఖాళీలు .. భర్తీ చెయ్యాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్ వన్ , గ్రూప్ టూ లలో కేవలం 36 పోస్టులు మాత్రమే చూపించడం నిరుద్యోగులను వంచించటమేనని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. దాదాపు గ్రూప్ 1 , గ్రూప్ 2 లో సుమారు వెయ్యి ఖాళీ లకు పైగా ఉన్నట్లు గుర్తించి కేవలం 36 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం దేనికని పవన్ ప్రశ్నించారు. ఉపాధ్యాయ పోస్టులు వేలల్లో ఖాళీగా ఉన్నాయని, ముఖ్యమంత్రి చెప్పిన మెగా డీఎస్సీ ఏమై పోయిందని నిలదీశారు. పోలీస్ శాఖలో 7 వేలకు పైగా ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉందని పవన్ డిమాండ్ చేశారు.
    Published by:Nagesh Paina
    First published: