HOME »NEWS »ANDHRA PRADESH »pawan kalyan reaction after visakha girl draws his photo with mouth sk

Pawan Kalyan: ఫ్యాన్ బర్త్ డే గిఫ్ట్‌కి జనసేనాని ఫిదా.. విశాఖకు వచ్చినపుడు కలుస్తా..

Pawan Kalyan: ఫ్యాన్ బర్త్ డే గిఫ్ట్‌కి జనసేనాని ఫిదా.. విశాఖకు వచ్చినపుడు కలుస్తా..
పవన్ కళ్యాణ్

విశాఖ వచ్చినప్పుడు కలుస్తానని పవన్ కల్యాణ్ చెప్పడంతో స్వప్న ఆనందానికి అవధుల్లేవు. ఎప్పుడెప్పుడు ఆ క్షణం వస్తుందా అని ఎదురుచూస్తోంది.

  • Share this:
    ఆమెకు రెండు చేతులు లేవు. కానీ గుండెల నిండా పవన్ కల్యాణ్‌పై అభిమానం పెంచుకుంది. అందుకే చేతులు లేకున్నా నోటితోనే తనకు ఎంతో ఇష్టమైన పవన్ ఫొటోను గీసింది. ఏదో మొక్కుబడిగా గీయడం కాదు.. చాలా అద్భుతంగా డ్రాయింగ్ వేసింది. ఆ డ్రాయింగ్‌ను చూపిస్తూ పవన్ కల్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. విశాఖకు చెందిన స్వప్న అనే యువతి పవన్ కల్యాణ్‌ వీరాభిమాని. సెప్టెంబరు 2న అందరూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పగా.. ఈమె నోటితే పెన్సిల్ డ్రాయింగ్ వేసి శుభాకాంక్షలు తెలిపింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పవన్ దృష్టికి వెళ్లింది. ఆ వీడియోను ట్వీట్ చేస్తూ.. రిప్లై ఇచ్చారు జనసేనాని.

    విశాఖ వచ్చినప్పుడు కలుస్తానని పవన్ కల్యాణ్ చెప్పడంతో స్వప్న ఆనందానికి అవధుల్లేవు. ఎప్పుడెప్పుడు ఆ క్షణం వస్తుందా అని ఎదురుచూస్తోంది. ఇక పవన్ కల్యాణ్ చిత్రపటాన్ని నోటితో అద్భుతంగా గీసిన ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. నువ్వు చాలా గ్రేట్ అంటూ జనసైనికులు, పవన్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:September 04, 2020, 10:24 IST