Andhra Pradesh : పవన్ క‌ళ్యాణ్‌ ప‌ర్య‌ట‌న‌లో అప‌శృతి.. రెండు కార్లుఢీ అభిమానికి గాయాలు

ప‌వ‌న్ క‌ళ్యాన్ ర్యాలీ

జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా ప‌ర్య‌ట‌న‌లో అపశృతి చోటు చేసుకొంది. రెండు వాహ‌నాలు ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న మంగళగిరి డీజీపీ కార్యాలయం ముందు జ‌రిగింది.

  • Share this:
    జనసేన అధినేత, సీని హీరో పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న నిర్వ‌హిస్తున్న పామర్రు మండలంలోని కనుమూరు దగ్గర కారు ర్యాలీలో అపశృతి జరిగింది. ప‌వ‌న్ వెళ్తున్న మార్గంలో ప‌లు వాహ‌నాలు అనుస‌రిస్తున్నస‌మ‌యంలో రెండు కార్ల మధ్య ఒక బైక్ ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తికి కాలు విరిగిపోయింది. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ కారు దిగారు.. తన కారులో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ యువకున్ని వెంటనే హాస్పిటల్ కు తరలించి మెరుగైన వైద్యం త‌క్ష‌ణ‌మే అందించాలని వైద్యులకు పవన్ కళ్యాణ్ సూచించారు. తుపాన్ కార‌ణంగా మూలంగా పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి వారి స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా స్వయంగా తెలుసుకొనేందుకు పవన్ కల్యాణ్ నాలుగు రోజులపాటు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు.

    ఈ నేప‌థ్యంలో ఆయ‌న నేరుగా ఈ రోజు ఇవాళ హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన కృష్ణా జిల్లాలో తుఫాను ప్ర‌భావిత‌ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప‌లు చోట్ల రైతులు తుఫాను కార‌ణంగా తాము పెట్టిన పెట్టుబ‌డి పూర్తిగా న‌ష్ట‌పోయామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

    Pawan Kalyan: వైసీపీలో చేరేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నం.. డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు


    తమకు ప్రభుత్వం నుంచి సాయం అందించలేదని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని ప‌వ‌న్ క‌ళ్యాన్ వారికి హామీ ఇచ్చారు. శుక్ర‌వారం వ‌ర‌కు పవ‌న్ క‌ళ్యాన్   ప‌ర్య‌టించ‌నున్నారు.  కృష్ణా జిల్లా పర్యటన అనంతరం పవన్ కల్యాణ్ పులిగడ్డ వంతెన మీదుగా గుంటూరు జిల్లాకు చేరుతారు. భట్టిప్రోలు, చావలి, పెరవలి ప్రాంతాల మీదుగా తెనాలి, నందివెలుగు, కొలకలూరుల్లో పర్యటిస్తారు.

    ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బుధ‌వారం కృష్ణా జిల్లాలో పామర్రు మండలం కనుమూరు వ‌ద్ద ప‌ర్య‌టించారు. ఈ నేప‌థ్యంలోనే ర్యాలీ నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది. రెండు రెండు కార్ల మధ్య ఓ బైక్ ఇరుక్కుంది. దీంతో బైక్ పై వెళుతున్న జనసేన కార్యకర్త కాలు విరిగింది. తీవ్రంగా గాయపడ్డ యువకున్ని వెంటనే హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
    Published by:Sharath Chandra
    First published: