హోమ్ /వార్తలు /andhra-pradesh /

Pawan Kalyan - Posani : పవన్ కళ్యాణ్‌ను చెప్పుతో కొడతా.. ఇంటిపై రాళ్ల దాడి తర్వాత పోసాని సంచలనం..

Pawan Kalyan - Posani : పవన్ కళ్యాణ్‌ను చెప్పుతో కొడతా.. ఇంటిపై రాళ్ల దాడి తర్వాత పోసాని సంచలనం..

అయితే ఆ ఎపిసోడ్ తర్వాత పోసాని రెండు మూడు రోజులు ఎవరికీ కనిపించలేదు. ఇంటిపై కూడా దాడి చేసారంటూ మీడియా ముందుకొచ్చాడు. తనపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించారని.. తన భార్యను కూడా దారుణంగా విమర్శించారని గోడు వెల్లబోసుకున్నాడు పోసాని. ఇవన్నీ ఇలా ఉంటే ఇది మాత్రం ఆయన కెరీర్‌పై దారుణమైన ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తుంది.

అయితే ఆ ఎపిసోడ్ తర్వాత పోసాని రెండు మూడు రోజులు ఎవరికీ కనిపించలేదు. ఇంటిపై కూడా దాడి చేసారంటూ మీడియా ముందుకొచ్చాడు. తనపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించారని.. తన భార్యను కూడా దారుణంగా విమర్శించారని గోడు వెల్లబోసుకున్నాడు పోసాని. ఇవన్నీ ఇలా ఉంటే ఇది మాత్రం ఆయన కెరీర్‌పై దారుణమైన ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తుంది.

Pawan Kalyan - Posani Krishna Murali : ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఘాటుగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను చెప్పుతో కొడతా అంటూ పోసాని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...

Pawan Kalyan - Posani Krishna Murali : ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఘాటుగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సందర్భంగా సినీ నటుడు, రచయత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ పై అంతే తీవ్రంగా  స్పందించారు. ఈ సందర్భంగా పవన్ పై పోసాని కామెంట్స్ చేసిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ కొంత మంది పోసానిపై హైదరాబాద్‌లో ప్రెస్‌క్లబ్‌లో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు హైదరాబాద్‌లోని పోసాని కృష్ణమురళి ఇంటిపై రాళ్ల దాడి  చేసారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి ఓ మీడియాకు ఫోన్ ఇన్ ఇచ్చారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ తీరుపై ఓ రేంజ్‌లో విరుచుపడ్డారు.

ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ.. నేను పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలతో కొంత మంది తనకు ఫోన్‌లో చంపేస్తామంటూ అసభ్యకరమైన మెసెజ్‌లు పంపిస్తూనే ఉన్నారు. అంతేకాదు తన భార్యను కూడా ఇందులో లాగుతూ.. అసభ్యకరంగా మాట్లాడరన్నారు. ఈ విషయమై చిరంజీవి.. పవన్ కళ్యాణ్‌ను మందలించ వచ్చుకదా అన్నారు.

Super Star Krishna : అప్పట్లోనే సూపర్ స్టార్ కృష్ణ చేసిన ఈ సూపర్ హిట్ సీక్వెల్ మూవీ తెలుసా..

అంతేకాదు చిరంజీవి ప్రెస్ మీట్ పెట్టి... పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ చేసిన పనులను ఖండించవచ్చు కదా అన్నారు. అప్పట్లో ప్రజారాజ్యం స్థాపించిన సందర్భంలో ఒకసారి చిరు ఫ్యామిలీపై కొంత మంది ఏదో మాట్లాడితే.. తాను ముందు ఉండి ఆ చర్యలను ఖండించానన్నారు. రాజకీయాలకు, నా భార్యకు ఏం సంబంధం ఉందా అంటూ పవన్ కళ్యాణ్‌ తీరు పోసాని ఈ సందర్భంగా  ప్రశ్నించారు.

Tamil Heroes In Telugu : విజయ్ సహా తెలుగు సినిమాల్లో డైరెక్ట్ ఎటాక్ చేసిన తమిళ హీరోలు ఇంకెవరున్నారంటే..

ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌ను ఎవరినైనా తిట్టవచ్చు ఏమైనా అనవచ్చు.  కానీ ఆయన్ని ఎవరు ఏమి అనకూడదు. పవన్ కళ్యాణ్ ది సైకో బుద్ది అన్నారు. సర్ధార్ గబ్బర్ సింగ్ షూటింగ్ విషయంలో తనను కావాలనే తీసేసారు. అంతేకాదు పవన్ కళ్యాణ్  సర్ధార్ గబ్బర్ సింగ్  కో డైరెక్టర్ పై  చేయి చేసుకున్నారు.

James Bond Heroes: సిల్వర్ స్క్రీన్ పై జేమ్స్ బాండ్‌గా ఇరగదీసిన హీరోలు వీళ్లే..

ఆ తర్వాత అతని తప్పు లేదని తెలిసిన పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పలేదన్నారు. చిరంజీవి ప్రజా రాజ్యం  పార్టీ పెట్టినపుడు ఆయన కాంగ్రెస్ వాళ్లను బట్టలూడదీసి కొట్టండన్నారు. ఇపుడు ఆయన అభిమానులకు పోసానిని బట్టలు విప్పి కొడతాం అంటున్నారు. నాయకులు ఎలా ఉంటారో.. ఆయన కార్యకర్తలు కూడా అలాగే ఉంటారు.

Puri Jagannadh Introduced Heroines: రేణు దేశాయ్, అనుష్క, అసిన్ సహా పూరీ జగన్నాథ్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన హీరోయిన్స్ వీళ్లే..

నాకు ఎవరితో శతృత్వం లేదు. 35 ఏళ్ల నుండి సినిమా పరిశ్రమలో ఉన్నాను. ఎవరితో ఎలాంటి గొడవలు లేదు. అంతేకాదు షూటింగ్‌లకు టైమ్‌కు వెళతాన్నారు.  పవన్ కళ్యాన్.. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో  పేర్నినాని గారిని ఓరేయ్ .. సన్యాసి అని సంభోదించారు. నేను పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించా కాబట్టి.. అతను నాకు శతృవుగా మారారు. నేను పవన్ కళ్యాణ్ లాంటి సన్నాసులను ఎంతో మందిని చూశాను.

Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

1981 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇలా బెదిరించడాలు చాలా చూశానన్నారు. రాళ్ల దెబ్బలకు భయపడను. పవన్ కళ్యాణ్‌ను నేను ఒక్కడినే చెప్పుతో కొడతాను. మహా అయితే.. ఏమి చేస్తారు నన్ను చంపేస్తారు. అభిమానులకు డబ్బులు ఇచ్చి నాపై ఉసిగోల్పడం ఏమిటన్నారు.  రాజకీయంగా తనను ఏమి అన్న పట్టించుకోను. కానీ తన ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.

First published:

Tags: Janasena, Pawan kalyan, Posani Krishna Murali, Tollywood, Ysrcp

ఉత్తమ కథలు