పవన్ కల్యాణ్ జనసేన పార్టీ 3వ జాబితా విడుదల

AP Elections: జనసేన పార్టీ తరఫున ఎన్నికల్లో నిలిచే అభ్యర్థుల 3వ జాబితాను సోమవారం రాత్రి జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ విడుదల చేశారు. ఈ తాజా జాబితాలో ఒక లోక్ సభ అభ్యర్థి, 13 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను  ఖరారు చేశారు.

Suresh Rachamalla | news18-telugu
Updated: March 19, 2019, 6:33 AM IST
పవన్ కల్యాణ్ జనసేన పార్టీ 3వ జాబితా విడుదల
జనసేన పార్టీ
  • Share this:
జనసేన పార్టీ తరఫున ఎన్నికల్లో నిలిచే అభ్యర్థుల 3వ జాబితాను సోమవారం రాత్రి విడుదల చేశారు. ఈ జాబితాలో ఒక లోక్ సభ అభ్యర్థి, 13 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్  ఖరారు చేశారు. ఆదివారం విడుదల చేసిన రెండో జాబితాలో ఒక అభ్యర్థి స్థానాన్ని మార్పు చేశారు. గిద్దలూరు స్థానం నుంచి ముందుగా ప్రకటించిన షేక్ రియాజ్ తాజా మార్పులో భాగంగా ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గిద్దలూరు స్థానం నుంచి బైరబోయిన చంద్ర శేఖర్ యాదవ్ పోటీ చేస్తారు. తాజాగా జనసేన విడుదల చేసిన జాజితా ప్రకారం.. ఒంగోలు లోక్‌ సభ అభ్యర్థిగా  శ్రీ బెల్లంకొండ సాయిబాబు పోటీ చేయనున్నారు.  జనసేన పార్టీ  విడుదల చేసిన  తాజా జాబితా ప్రకారం.. వివిధ స్థానాల్లో  పోటీ చేయనున్న అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

లోక్ స‌భ అభ్య‌ర్ధి

ఒంగోలు -  బెల్లంకొండ సాయిబాబు

శాస‌న‌స‌భ అభ్య‌ర్ధులు

  • టెక్క‌లి -  క‌ణితి కిర‌ణ్ కుమార్

  • పాల‌కొల్లు -  గుణ్ణం నాగ‌బాబు
  • గుంటూరు ఈస్ట్ -  షేక్ జియా ఉర్ రెహ్మాన్

  • రేప‌ల్లె- శ్రీ క‌మ‌తం సాంబ‌శివ‌రావు

  • చిల‌క‌లూరిపేట -  మిరియాల ర‌త్న‌కుమారి

  • మాచ‌ర్ల -  కె. ర‌మాదేవి

  • బాప‌ట్ల -  పులుగు మ‌ధుసూధ‌న్ రెడ్డి

  • ఒంగోలు -  షేక్ రియాజ్

  • మార్కాపురం -  ఇమ్మ‌డి కాశీనాధ్

  • గిద్ద‌లూరు -  బైర‌బోయిన చంద్ర‌శేఖ‌ర్ యాద‌వ్

  • పొద్దుటూరు -  ఇంజా సోమ‌శేఖ‌ర్ రెడ్డి

  • నెల్లూరు అర్బ‌న్ -  కేతంరెడ్డి వినోద్ రెడ్డి

  • మైదుకూరు -  పందిటి మ‌ల్హోత్ర‌

  • క‌దిరి -  సాడ‌గ‌ల ర‌వికుమార్ (వ‌డ్డె ర‌విరాజు )



First published: March 19, 2019, 6:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading