పవన్ కళ్యాణ్‌కు కేరళ ఆయుర్వేద చికిత్స...

ఈ చికిత్స ఎన్ని రోజులు ఉంటుందనే విషయంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. చికిత్స పూర్తయిన తర్వాత కూడా కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: October 3, 2019, 2:31 PM IST
పవన్ కళ్యాణ్‌కు కేరళ ఆయుర్వేద చికిత్స...
పవన్ కల్యాణ్ ( ట్విట్టర్ )
news18-telugu
Updated: October 3, 2019, 2:31 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేరళలోని ఓ ఆయుర్వేద చికిత్సాలయంలో చికిత్స పొందుతున్నారు. వెన్నునొప్పికి సంబంధించి ఆయనకు ఇద్దరు ఆయుర్వేద వైద్య నిపుణులు చికిత్స చేస్తున్నట్టు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్‌ వెన్నుకు గాయాలయ్యాయి. అయితే, దానికి చికిత్స తీసుకోవడంలో జనసేనాని నిర్లక్ష్యం వహించారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలు, ఎన్నికల ప్రచారంలో మునిగిపోవడంతో వెన్నునొప్పి మరింత బాధించింది. ఈ క్రమంలో తాజాగా ఆయన వెన్నునొప్పి మరింత తిరగబెట్టింది. పవన్ కళ్యాణ్‌కు ఆపరేష్ చేయాలని వైద్యులు సూచించారు. కానీ, ఆపరేషన్ కంటే ప్రకృతి వైద్యం మీద నమ్మకంతో పవన్ కళ్యాణ్ కేరళలో అడుగుపెట్టారు. అక్కడి ఆయుర్వేద వైద్య చికిత్సాలయంలో పవన్ కళ్యాణ్‌కు ఇద్దరు నిపుణులు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ఈ చికిత్స ఎన్ని రోజులు ఉంటుందనే విషయంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. చికిత్స పూర్తయిన తర్వాత కూడా కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితిని బట్టి మరోసారి చికిత్స చేయాలా? వద్దా? చేస్తే పద్ధతులు మార్చాలా? అనే అంశంపై నిపుణులు నిర్ణయం తీసుకుంటారు.

పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆయన కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరం కానున్నారు. గాంధీ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి కూడా ఆయన హాజరుకాలేదు. సైరా సినిమా ప్రి రిలీజ్ వేడుకల్లో కూడా పాల్గొనలేదు. గత కొద్ది రోజుల క్రితం వాటర్ మాన్ రాజేంద్రసింగ్, పవన్ ను కలిశారంటూ జనసేన ఆఫీసు నుంచి రెండు ఫొటోలు రిలీజ్ చేయడం వినహా పవన్ పార్టీ వ్యవహారాల్లో ఎక్కడా కనిపించడం లేదు.

First published: October 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...