పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కాదు.. పకీర్ సాబ్, ఏపీ మంత్రి సెటైర్లు

గుడివాడలో పవన్ కళ్యాణ్

‘పవన్ కళ్యాణ్ సినిమాల్లో వకీల్ సాబ్ అయి ఉండొచ్చు. బయట మాత్రం ఆయన పకీర్ సాబ్.’ అని వెలంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్ చేసుకోవడానికి జనంలోకి వచ్చారని దేవాదాయ శాఖ మంత్రి ఆరోపించారు.

 • Share this:
  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కాదని, పకీర్ సాబ్ అని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా మంత్రులు అందరూ పవన్ కళ్యాన్ మీద ఎదురుదాడికి దిగారు. ‘పవన్ కళ్యాణ్ సినిమాల్లో వకీల్ సాబ్ అయి ఉండొచ్చు. బయట మాత్రం ఆయన పకీర్ సాబ్.’ అని వెలంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్ చేసుకోవడానికి జనంలోకి వచ్చారని దేవాదాయ శాఖ మంత్రి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.35వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిన్న డిసెంబర్ 28న పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. పవన్ కళ్యాణ్ స్వయంగా కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గుడివాడలో ఆయన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జగన్ ప్రభుత్వం మీద కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని తన మీద విమర్శలు చేసే జగన్ కూడా సొంతంగా సిమెంట్ ఫ్యాక్టరీలు, పేపర్లు నడుపుతున్నారని, ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారన్నారు. అలాగే, పేకాట క్లబ్బులు నిర్వహించే వైసీపీ నేతల కంటే తాము బెటర్ అని అన్నారు.

  ‘గుడివాడ నడిబొడ్డున నిలబడి చెబుతున్నా. అంతిమ శ్వాస వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అండగా నిలబడతా. సినిమాలు చేస్తూ ఏం రాజకీయాలు చేస్తారని కొందరు మాట్లాడుతున్నారు. పేకాట క్లబులు నడిపి మీరు రాజకీయం చేయగా లేనిది నిజాయితీగా సినిమాలు చేసుకుంటూ నేను రాజకీయాలు చేయకూడదా? సిమెంటు ఫ్యాక్టరీలు, మైనింగ్ సంస్థలు, మీడియా సంస్థలు నడిపి మీరు రాజకీయం చేస్తుంటే... సినిమాలు చేసుకుంటూ మేమెందుకు రాజకీయాలు చేయకూడదు? ఎంతసేపూ మీరంటున్న మాటలు పడుతూ, మీ కిందే ఊడిగం చేయాలా? ఆ రోజులు పోయాయి. ఎదురు తిరిగే రోజులు వచ్చాయి. చొక్కా పట్టుకొని నిలదీసే రోజులివి జాగ్రత్తగా ఉండండి.’ అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

  గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మీద కూడా పవన్ కామెంట్స్ చేశారు. ఎంతో మంది నానీల్లో ఆయన కూడా ఓ బోడి నాని అని పవన్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. “ఈ రాష్ట్రంలో శివలింగం ఎవరో బొడి లింగం ఎవరో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ శివలింగం గనుకే నెత్తిన పెట్టుకున్నారన్నారు. శివలింగం ఎవరో బోడి లింగం ఎవరో భీమవరం, గాజువాక వెళ్తే చెప్తారని కౌంటర్ వేశారు. రెండు చోట్ల డిపాజిట్లు కూడా రానివారికి సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. బీమవరం, గాజువాకలో పోటీ చేస్తే ప్రజలు ఛీ కొట్టినా సిగ్గులేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీ తీసుకొని స్క్రిప్ట్ చదివి వెళ్లిపోయే దొంగలను ప్రజలు నమ్మొద్దన్నారు. పవన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరం” అని కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: