PAWAN KALYAN FAN WEDDING INVITATION VIRAL IN SOCIAL MEDIA JANASENA MANIFESTO IN WEDDING INVITATION NGS
Wedding Invitation: ఆయన అభిమాని అంటే ఇట్లుంటది మరి.. వైరల్ అవుతున్న వివాహ ఆహ్వాన పత్రిక
అభిమానం అంటే ఇట్లుంటది మరి
Wedding Invitaion: అభిమానం అంటే ఇలానే ఉంటుంది అంటున్నారు ఆయన అభిమానులు.. అందుకు వివాహ ఆహ్వాన పత్రికను ఎవరూ ఊహించని విధంగా తయారు చేయించాడు.. ప్రస్తుతం ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆహ్వాన పత్రికలో ఏం రాశాడో చూడండి.
Wedding Invitation: అభిమానం అంటే ఇలానే ఉంటుంది అంటున్నారు కొందరు.. ముఖ్యంగా రాజకీయ నేతలు, సినిమా నేతలపై అభిమానాన్ని ఒక్కో రూపంలో చూపిస్తుంటారు.. కొందరైతే మరి ఇంత అభిమానం ఉందా అని అందరికీ తెలిసేలా చూస్తారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులు అంటే ఆ లెక్క వేరే ఉంటుంది. అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్నారు పవన్.. అలాగే రెండు రంగాల్లోనూ ఆయన లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్నారు. అభిమానులు కూడా తమ అభిమానం వేరే లెవెల్ అంటూ నిరూపించుకున్నాడు. తాజాగా తూర్పుగోదావరి (East Godavari) జిల్లా కొవ్వూరుకు చెందిన హరీశ్ బాబు పవన్ కల్యాణ్ సారధ్యం వహిస్తున్న జనసేన పార్టీపై వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. జనసేన(Janasena) లీగల్ సెల్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న హరీశ్ బాబు వివాహం ఈ నెల 4న జరగనుంది. ఈ సందర్భంగా హరీశ్ బాబు తన వివాహ శుభలేఖపై ఏ రాశాడో తెలుసా..?
పవన్ అంటే తనకు చాలా అభిమానం అన్నారు. అందుకే జనసేన పార్టీ మేనిఫెస్టో, గుర్తు, పవన్ కల్యాణ్ ఫొటోలను శుభలేఖలో ముద్రించారు. శుభలేఖ కింది భాగంలో పెళ్లి ముహూర్తం వివరాలను కూడా ప్రింట్ చేయించాడు. పవన్ కల్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన సిద్ధాంతాలు తనకు ప్రేరణ కలిగించాయని హరీశ్ బాబు చెప్పారు. జనసేన మేనిఫెస్టోతో ముద్రించిన ఈ శుభలేఖ పవన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పవన్ కళ్యాణ్ అంటే తనకు ప్రాణమని.. ఆయన సిద్ధాంతాలు తనకు ప్రేరణ కలిగించాయని కోటే హరీష్‌బాబు పేర్కొన్నాడు. అటు మేనిఫెస్టోతో ముద్రించిన ఈ శుభలేఖ జనసేన అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ శుభలేఖ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. అయితే పవన్ అభిమానులు ఇలా చేయడం ఇదే తొలి సారి కాదు.. సాధారణంగా పెళ్లి శుభలేఖల మీద దేవుడి ఫొటోలు వేస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని తనకు పవన్ కళ్యాణ్ దేవుడు అంటూ తన పెళ్లి శుభలేఖ మీద జనసేనాని ఫొటోలు ముద్రించి సందర్భాలు రెండు మూడు ఉన్నాయి.
గతంలో విశాఖ జిల్లాకు చెందిన రాజేష్ రెడ్డి అనే అభిమాని ఇలా జనసేన తరహాలో వెడ్డింగ్ కార్డును ముద్రించాడు. అక్టోబర్ 13న రాజేష్ రెడ్డికి హేమలతతో విశాఖపట్నంలో వివాహం జరిగింది. ఈ పెళ్లికి తమ బంధువులు, స్నేహితులను పిలిచేందుకు ఈ వెడ్డింగ్ కార్డులు అప్పట్లో ఇచ్చాడు. ఇప్పుడు అతడిని మించి అనేలా.. తూర్పుగోదావరి జిల్లాలో హరీశ్ బాబు.. ఈ శుభలేఖలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కేవలం పవన్ మాత్రమే కాదు.. గతంలో కూడా కొందరు అభిమానులు తమ తమ అభిమాన నేతలు, హీరోల మీద ప్రేమను చాటుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా తమ పెళ్లి శుభలేఖల్లో మోదీ, బాలయ్య ఫొటోలను ముద్రించారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.