పవన్ కళ్యాణే నా దేవుడు.. శుభలేఖపై పవర్ స్టార్ ఫొటోలు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని తనకు పవన్ కళ్యాణ్ దేవుడు అంటూ తన పెళ్లి శుభలేఖ మీద జనసేనాని ఫొటోలు ముద్రించాడు.

news18-telugu
Updated: October 10, 2019, 8:48 PM IST
పవన్ కళ్యాణే నా దేవుడు.. శుభలేఖపై పవర్ స్టార్ ఫొటోలు..
జనసేనను తలపించేలా శుభలేఖను డిజైన్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమాని
  • Share this:
పెళ్లి శుభలేఖల మీద సహజంగా దేవుడి ఫొటోలు వేస్తారు. అయితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని తనకు పవన్ కళ్యాణ్ దేవుడు అంటూ తన పెళ్లి శుభలేఖ మీద జనసేనాని ఫొటోలు ముద్రించాడు. పెళ్లి శుభలేఖను కూడా జనసేన జెండా తరహాలో డిజైన్ చేశాడు. శుభలేఖ బ్యాక్‌ గ్రౌండ్‌లో కూడా పవన్ కళ్యాణ్ ఫొటోను, జనసేన చిత్రాన్ని ముద్రించాడు. విశాఖ జిల్లాకు చెందిన రాజేష్ రెడ్డి అనే అభిమాని ఇలా జనసేన తరహాలో వెడ్డింగ్ కార్డును ముద్రించాడు. అక్టోబర్ 13న న రాజేష్ రెడ్డికి హేమలతతో వివాహం నిశ్చమైంది. విశాఖపట్నంలో జరగబోయే ఈ పెళ్లికి తమ బంధువులు, స్నేహితులను పిలిచేందుకు ఈ వెడ్డింగ్ కార్డులు రెడీ చేశాడు. ఈ శుభలేఖల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇలాంటి ఘటనలు ఇదే మొదటిదేం కాదు. గతంలో కూడా కొందరు అభిమానులు తమ తమ అభిమాన నేతలు, హీరోల మీద ప్రేమను చాటుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా తమ పెళ్లి శుభలేఖల్లో మోదీ, బాలయ్య ఫొటోలను ముద్రించారు.

Video : చంద్రబాబు మూతిపై వాత పెట్టాలన్న వైసీపీ ఎమ్మెల్యే

First published: October 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading