రూ. కోటి చెక్‌తో రేపు ఢిల్లీకి పవన్ కళ్యాణ్...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 20న ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని జనసేన పార్టీ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.

news18-telugu
Updated: February 19, 2020, 2:46 PM IST
రూ. కోటి చెక్‌తో రేపు ఢిల్లీకి పవన్ కళ్యాణ్...
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)
  • Share this:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 20న ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని జనసేన పార్టీ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఉదయం కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శిస్తారు. గత ఏడాది డిసెంబర్‌లో ఆయన కేంద్రీయ సైనిక్ బోర్డుకు రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రకటించిన కోటి రూపాయల విరాళానికి సంబంధించిన చెక్‌ను ఈ సందర్భంగా సైనిక అధికారులకు అందజేస్తారు. డిసెంబర్ 9న మిలటరీ డే సందర్భంగా అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ ఈ విరాళాన్ని ప్రకటించారు.



ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర మానవవనరుల శాఖ నిర్వహించే ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొంటారు. దేశానికి స్వచ్ఛమైన యువ రాజకీయ నాయకత్వాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. పవన్ కళ్యాణ్ స్పీచ్‌తో పాటు జనసేనాని గురించి చిత్రీకరించిన ఓ షార్ట్‌ ఫిలింను కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు. ఈ ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సుకు మేఘాలయ అసెంబ్లీ స్పీకర్ మెత్బా లింగ్లో అధ్యక్షత వహిస్తారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
pawan kalyan,chiranjeevi,praja rajyam party, bjp, andhra pradesh, lok sabha elections, janasena, caste,kapulu,తెలుగు వార్తలు, జనసేన, పవన్ కళ్యాణ్, బీజేపీ, చిరంజీవి, ప్రజారాజ్యంపార్టీ,ఆంధ్రప్రదేశ్,
జేపీ నడ్డాను కలిసిన పవన్


జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరినప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. ఆ తర్వాత మరోసారి ఆయన హస్తిన వెళ్తున్నారు. అయితే, బీజేపీ పెద్దలతో కలుస్తారా? లేదా? అనే విషయంపై పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. బీజేపీ - జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత రెండు పార్టీలు కలసి తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించాయి. కానీ, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తన పోరాటాన్ని తాను చేస్తున్నారు. బీజేపీతో కలసి చేయాలనుకున్న లాంగ్ మార్చ్ వాయిదా పడింది. దీంతోపాటు తాజాగా రాష్ట్ర బీజేపీ నేతల తీరు మీద పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీలో నేతలు చెప్పేది ఒకటైతే, రాష్ట్రంలో నేతలు మరో మాట చెబుతున్నారని, ఈ పద్ధతి మార్చుకోవాలన్నారు. ఇప్పుడు ఢిల్లీ టూర్‌లో బీజేపీ పెద్దలను కలిస్తే రాష్ట్రంలోని కమలనాధుల మీద ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
First published: February 19, 2020, 2:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading