వైసీపీలో పవన్ కళ్యాణ్ చిచ్చు...? బొత్స సీఎం అవుతారా?

Andhra Pradesh : అమరావతి అంశంపై కాకరేగుతున్న వేళ... పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కొత్త చర్చకు తెరతీశాయి. అసలు పవన్ ఏమన్నారు? వైసీపీలో ఏం జరుగుతోంది?

Krishna Kumar N | news18-telugu
Updated: September 2, 2019, 6:26 AM IST
వైసీపీలో పవన్ కళ్యాణ్ చిచ్చు...? బొత్స సీఎం అవుతారా?
బొత్స సత్యనారాయణ, పవన్ కళ్యాణ్
Krishna Kumar N | news18-telugu
Updated: September 2, 2019, 6:26 AM IST
Amaravati : రాజధానిలో రైతుల సమస్యలు తెలుసుకోవడానికి రెండ్రోజులపాటూ... అమరావతి, మంగళగిరిలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్... ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ప్రధానంగా... ఏపీ సీఎం జగన్ ఉచ్చులో పడవద్దనీ, జగన్‌ను నమ్మి మోసపోవద్దనీ పవన్ కళ్యాణ్... బొత్స సత్యనారాయణకు సూచించారు. సీఎం కావాలని కలలుకంటున్న బొత్స సత్యనారాయణకు... జగన్ వల్ల ఆ ఛాన్స్ రాకుండా పోతుందనీ, అందువల్ల బొత్స... ఈ విషయంలో పునరాలోచించుకోవాలని కోరుతూ కామెంట్లు చేశారు పవన్ కళ్యాణ్. ఐతే... మర్నాడే ప్రెస్‌మీట్ పెట్టిన బొత్స సత్యనారాయణ... ఏకంగా అరగంటపాటూ... పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి మాట్లాడారు. అందులో తాను ఇష్టపడే వైసీపీలోకి వచ్చాననీ, జగనే తమ సీఎంగా ఉంటారనీ, ఈ విషయంలో రెండో మాట లేదనీ స్పష్టం చేశారు. పైగా... జనసేన, టీడీపీ లాంటి పార్టీలు ప్రతిపక్షంగా ఉన్నంతకాలం... వైసీపీ అధికారంలోనే ఉంటుందని అన్నారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని బొత్స సత్యనారాయణ ఖండించినప్పటికీ... ఈ వ్యాఖ్యలపై వైసీపీ, జనసేన... రెండు పార్టీల్లో తెరవెనక చర్చ జరుగుతోంది. ప్రధానంగా బొత్స అనుచరులు... ఈ కామెంట్లను సీరియస్‌గా తీసుకున్నారు. ఉత్తరాంధ్ర నుంచీ బొత్స సీఎం అయితే... తమ జిల్లాలు అభివృద్ధి చెందుతాయనీ... ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా... అలాంటి పరిస్థితులు ఇప్పటివరకూ రాలేదని వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బొత్స సత్యనారాయణ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అప్పట్లో ఆయన మంత్రిగా పనిచేసి... పార్టీలో కీలక నేతగా మారారు. వైఎస్ మరణానంతరం... రాష్ట్ర విభజన అంశం కాకరేపి... కాంగ్రెస్ పార్టీ ఫేడవుట్ అవ్వడంతో... బొత్స సత్యనారాయణ సైలెంటైపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆయన... ప్రస్తుతం ఆ పార్టీలో కీలక నేతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇటీవల బొత్స రౌండ్ ది క్లాక్ పనిచేస్తున్నారు. ప్రధానంగా రాజధాని అంశంపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. ప్రతిపక్షాలు వైసీపీపై దుమ్మెత్తి పోశాయి. ఐతే... ఇలాంటి ఎన్నో సందర్భాల్ని ఎప్పటి నుంచో చూస్తున్న బొత్స... విపక్షాల విమర్శల్ని అంతే ఘాటుగా తిప్పి కొడుతున్నారు కూడా.... ఐతే... పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల విషయంలో మాత్రం బొత్స సత్యనారాయణ... అంత సీరియస్‌గా రియాక్ట్ అవ్వలేదనీ... మనసులో సీఎం అవ్వాలనే ఆలోచన ఉండటం వల్లే ఆయన గట్టిగా మాట్లాడలేదనే వాదన వినిపిస్తోంది పొలిటికల్ సర్కిల్‌లో. జగన్ ఉన్నంతకాలం సీఎం పీఠం ఎక్కే ఛాన్స్ బొత్సకు రాదనే అంశం... ఆయన అనుయాయులకు ఇప్పుడు నిరాశ కలిగిస్తోంది. మంత్రి పదవితోపాటూ... పార్టీలో బొత్సకు మరింత ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు ఆయన మద్దతుదారులు.

ఏపీ రాజకీయాల్లో కూడా ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్... వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేశారనీ... వైసీపీలో విభజన సృష్టించేందుకే... ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. ఐతే... ఇవన్నీ పవన్ కళ్యాణ్ సొంత ఆలోచనలు కావనీ... తెరవెనక వేరే ఎవరో... ఆయనతో ఇలాంటి కామెంట్లు చేయిస్తున్నారని కొందరంటున్నారు. ఈ కారణాలతో ప్రస్తుతం ప్రతీ అంశంలో సీఎం జగన్ బదులు... మీడియా ముందుకొచ్చి ప్రభుత్వ ఆలోచనను చెబుతున్న బొత్స సత్యన్నారాయణ... ఏపీ పాలిటిక్స్‌లో సెంటరాఫ్ డిబేట్ అవుతున్నారు.

First published: September 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...