Home /News /andhra-pradesh /

PAWAN KALYAN CONDEMNS DALIT GIRL MURDER IN DHARMAVARAM SAYS BRINGING ACTS FOR PUBLICITY WONT SAVE WOMEN BA

పోలీసులు అలాంటి సలహా ఇస్తారా?.. ధర్మవరంలో యువతి హత్యపై స్పందించిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ (ఫైల్)

పవన్ కళ్యాణ్ (ఫైల్)

‘చిత్తశుద్ది లేకుండా ప్రచారం కోసం చట్టాలు చేస్తే ఎంత ప్రయోజనం ఉండదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ దిశ చట్టమే. ప్రచారం కోసం తెచ్చిన ఈ చట్టం ఆడబిడ్డలకు ఏ రకంగా రక్షణ కల్పిస్తుందో ముఖ్యమంత్రి జగన్, హోమంత్రి సుచరిత ప్రజలకు సమాధానం చెప్పాలి.’ అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

ఇంకా చదవండి ...
    అనంతపురం జిల్లా ధర్మవరంలో యువతి స్నేహలత హత్యపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తమ కుమార్తెను ఇద్దరు యువకులు వేధిస్తున్నారంటూ బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేస్తే ‘ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోండి.’ అని సలహా ఇవ్వడాన్ని పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే, ఏపీలో జగన్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. కేవలం ప్రచారం కోసం చట్టాలు తెస్తే ఇలాగే ఉంటుందన్నారు. మహిళల కోసం దిశ చట్టం చేశాం. నేరం చేసిన వారికి 21 రోజుల్లోనే శిక్ష పడుతుందని ప్రచారం చేసిన ఏపీ సర్కారు ఆచరణలో ఒక్క అడుగు కూడా వేయలేదన్నారు. దీని వల్ల మైనర్ బాలికలు, విద్యార్థినులు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలు, దాడులు ఆగడం లేదన్నారు. ‘విజయవాడలో రెండు ఘటనలు జరిగాయి. గాజువాకలో ఒక ఘటనలో యువతులు మృగాళ్ల చేతిలో హత్యకు గురయ్యారు. ఇప్పుడు అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత అనే పేద దళిత యువతి దారుణ హత్యకు గురవడం బాధాకరం. తమ బిడ్డను వేధిస్తున్నారు.. మా ఇంటి ముందుకు వచ్చి భయపెడుతున్నారని బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అక్కడ పోలీసు అధికారుల ప్రవర్తన మరింత కుంగదీసింది. అక్కడి నుంచి ఇల్లు మారిపోండి అని పోలీసులు చెప్పడం చూస్తే ఆ వ్యవస్థ ఎంత బాధ్యతారాహిత్యంగా ఉందో అర్థం అవుతోంది. వ్యవస్థల వైఫల్యం వల్లే స్నేహలత ఇద్దరు దుర్మార్గుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయింది.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

    స్నేహలత కుటుంబానికి పవన్ కళ్యాణ్ తన సానుభూతి తెలిపారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అలాగే, జగన్ ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ‘చిత్తశుద్ది లేకుండా ప్రచారం కోసం చట్టాలు చేస్తే ఎంత ప్రయోజనం ఉండదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ దిశ చట్టమే. దిశ చట్టం వచ్చి ఏడాది అయింది. చట్టం రాగానే పాలాభిషేకాలు చేయించుకుని కేకులు కోయించుకున్నారు. చట్టాన్ని మాత్రం ఆచరణలోకి తీసుకురాలేదు. ఆడబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడాలు, కత్తి పోట్లు మాత్రం ఆగడం లేదు. ప్రచారం కోసం తెచ్చిన ఈ చట్టం ఆడబిడ్డలకు ఏ రకంగా రక్షణ కల్పిస్తుందో ముఖ్యమంత్రి జగన్, హోమంత్రి సుచరిత ప్రజలకు సమాధానం చెప్పాలి.’ అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

    అనంతపురం జిల్లాలో ఏం జరిగింది
    అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కాంట్రాక్ట్ ఉద్యోగి దారుణ హత్యకు గురైంది. ఆమెను చంపిన తర్వాత మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు కాల్చి వేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. స్నేహలత అనే యువతి ఎస్‌బీఐలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆమె మంగళవారం (డిసెంబర్ 22) ఉదయం యధావిధిగా ఆఫీసుకు వెళ్లింది. కానీ, రాత్రి అయినా కూడా ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. అనంతపురం వన్ టౌన్ పోలీసులు వెంటనే అప్రమత్తమై గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో యువతి మృతదేహం లభించింది. ధర్మవరం మండలం బాదన్నపల్లిలో బుధవారం ఉదయం ఆమె డెడ్ బాడీ కనిపించింది. అత్యంత దారుణంగా ఆమె చనిపోయిన తర్వాత మృతదేహం కాల్చేశారు. ఆమె తమ కుమార్తే అని బాధితురాలి కుటుంబసభ్యులు గుర్తించారు. రాజేష్, కార్తీక్ అనే ఇద్దరు యువకులు తమ కుమార్తెను చంపారని వారు ఆరోపించారు. పోలీసుల విచారణలో వారిద్దరూ నేరం అంగీకరించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Anantapuram, Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP disha act, Disha Act 2019, Pawan kalyan

    తదుపరి వార్తలు